Search
Tuesday 19 June 2018
  • :
  • :

ఖరీఫ్ సాగుకు సిద్ధ్దమైన రైతన్న

Farmers Prepare To Khariff Season Cultivation

మనతెలంగాణ/సిద్దిపేట పతినిధి : తొలకరి పలకరింపుతో జిల్లా వ్యాప్తంగా రైతులు ఖరీఫ్ సాగు కోసం అన్ని విధాలుగా శ్రీకారం చుట్టారు. ఖరీఫ్ పంట అంటేనే వర్షాలపై ఆధారపడి ఋతుపవనాల రాక నుంచి తిరోగమనం వరకు పండించే పంటలని చెప్పుకోవచ్చు. ఈ సీజన్‌లో మొక్కలు నాటడం, పంటసాగు చేయడం, నూర్పిళ్లు లాంటివి జరుగుతాయి. వాతావరణ మార్పుల ద్యారా వర్షాలు కురువడంతో రైతులు జిల్లాలో అనేక చోట్ల నాగళ్లు, ట్రాక్టర్లతో పొలాలను దున్నుకుంటున్నారు. రైతుబంధు సాయంతో మురిసిపోయిన రైతులు పంటల సాగుకు విత్తనాలు, ఎరువులు సిద్ధ్దంగా ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా 5.60 లక్షల ఎకరాల సాగు భూమి ఉంది. గత సంవత్సరం 4.70లక్షల ఎకరాల భూమి సాగు కాగా ఈ ఖరీఫ్‌లో మాత్రం 4.70 లక్షల ఎకరాలలో సాగు అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇది ఇలా ఉండగా రైతులు మాత్రం అధిక సాగు కోసం పత్తి పంటనే వేయాలనే ఆలోచనలో ఉన్నారు. జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఈ సీజన్ ప్రారంభంలోనే జిల్లాలోని ఆయా గ్రామాలలో అధికారులు పరీక్షలు నిర్వహించారు. ఇందులో 67 ఎకరాల వరిసాగు, 1.80 లక్షల ఎకరాల మొక్కజొన్న, 2.37 లక్షల ఎకరాల పత్తి పంట సాగు అవుతుంది. ఓ వైపు రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు పథకం ప్రవేశపెట్టి పంట సాగు కోసం ఎకరాకు రూ.4 వేలు అందించడంతో రైతులు మరింత ఉత్సాహంతో అధిక దిగుబడులు వచ్చే పంటల వైపు మొగ్గు చూపుతున్నారు. దీనికి తోడు నాణ్యమైన విద్యుత్ నిరంతర సరఫరా కలిసి రావడంతో రైతులలో అధిక పంట సాగు అవుతుందన్న ధీమాలో రైతన్నలు ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా రైతులకు పంటల సాగు కోసం విత్తనాలు, ఎరువుల కొరత లేకుండా ఎప్పటికప్పుడు రాష్ట్ర మంత్రి తన్నీరు హరీశ్‌రావు, జిల్లా కలెక్టర్ వెంక్రటామారెడ్డిలు సమీక్షా సమావేశాలు నిర్వహించి అన్ని విధాలుగా సలహా, సూచనలు అందిస్తున్నారు.
విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉన్నాయి :జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రావణ్ కుమార్
రాష్ట్ర మంత్రి తన్నీరు హరీశ్‌రావు, జిల్లా కలెక్టర్ వెంకట్రామారెడ్డి ఆదేశాల మేరకు  రైతులకు జిల్లా వ్యాప్తంగా విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచామని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రావణ్‌కుమార్ తెలిపారు.  రైతులు ఎరువులు, విత్తనాల కోసం ఎలాంటి అందోళన చెందవద్దన్నారు. 4లక్షల  పత్తి విత్తనాలు, 18 వేల క్విం టాళ్ల వడ్లు, 16 వేల క్వింటాళ్ల మొక్క జొన్నతోపాటు,  కంది, పెసరు, తదితర  అరుతడి పంటల విత్తనాలు అందుబాటులోఉంచామన్నారు.

Comments

comments