Search
Sunday 24 June 2018
  • :
  • :
Latest News

రైతు కన్నీటి వ్యథ

Farmer's tears Affliction

కొనుగోలు కేంద్రాల్లోనే మొక్కజొన్న, ధాన్యం

ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ 

రంగు మారిందని తిరస్కరిస్తున్న అధికారులు

కష్టపడి పండించిన పంట కొనేనాధుడు కరువై రైతాంగం నానా ఇబ్బందులు పడుతు న్నారు. అమ్మబోతే అడవీ కొనబోతే కోరవి అన్న సామేత ప్రస్తుత రైతు పరిస్థితికి అతికిన ట్లుగా సరిపోతుంది. నెలల తరబడి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో వేచి ఉన్న అధికార యంత్రాంగం కనికరించడం లేదు. అకాల వర్షాలకు ధాన్యం, మొక్కజొన్నలు తడిసి రంగు మారాయని కొనుగోలు చేయకుండా తిరస్కరిస్తున్నారు. కొనుగోలు కేంద్రాల్లో సదుపాయాలు లేక వర్షానికి పట్టాలు కప్పడం, తిరిగి ఎండ బోయడంతోనే రైతాంగానికి సరిపోతుంది. వ్యవసాయోత్పత్తులను విక్రయించడం రైతుకు భారంగా మారింది. ఇదో రైతు కన్నీటి వ్యథ

మన తెలంగాణ/ ఖమ్మం: ఎప్పుడు లేనంతగా ఈ సంవత్సరం వ్యవసాయ ఉత్పత్తుల విక్రయానికి సంబంధించి రైతాంగం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ధర సంగతి దేవుడెరుగు అసలు కొనేనాధుడు కన్పించడం లేదు. ప్ర భుత్వం మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయ గా సమీప రైతులు మొక్కజొన్నలను విక్రయించేందుకు తీసుకెళ్లారు. రోజులు గడుస్తున్నా బస్తాలు, లారీల కొరత అంటూ కొనుగోళ్లను నిలిపివేశారు. ఇదే సమయంలో అకాల వర్షాలు రైతులను తీవ్ర ఇ బ్బందులకు గురి చేశాయి. కొనుగోలు కేంద్రాల వద్ద కనీస సదుపాయాలు కల్పించకపోవడంతో రైతులు తమ వ్యవసాయోత్పత్తులను ఆరు బయటనే ఉంచారు. అకాల వర్షాలకు ఎన్ని రక్షణ చర్యలు తీ సుకున్నా కొద్ది మేర తడిసి పోయాయి. అరబెట్టడం, తిరిగి పోగుచేయడం రైతులకు అదనపు పెట్టుబడిగా మారింది. అయినా ఇప్పుడు అధికారులు కొర్రీలుపెట్టి కొనుగోళ్లను తిరస్కరిస్తున్నారు.
ముదిగొండలో తడిసిన మొక్కజొన్న, ధాన్యం కొనుగోలు చేయాలని రైతన్నలు ఆందోళనకు దిగారు. అటువంటి ప రిస్థితి ఉమ్మడి ఖమ్మంజిల్లాలో ఉంది. ఇన్ని రోజులు కొనుగోలు కేంద్రాల్లో ఉంచి ఇప్పుడు ప్రైవేటు వ్యాపారులకు విక్రయించుకోండి అతి చౌకగా అడుగుతున్నారని రైతులు వాపోతున్నారు. మార్క్‌ఫెడ్ అధికారులు తిరస్కరించారని తెలిస్తే ప్రైవేటు వ్యాపారులు మొక్కజొన్నలను క్వింటా రూ.1000లకు కూడా అడగడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు మరో సమస్య ఎదురైంది. అల్లిపురం, పెద్దమునగాల తదితర కొనుగోలు కేం ద్రాలను వ్యవసాయ భూముల్లో ఏర్పాటు చేశారు, రెండు రోజుల క్రితం కురిసిన భారీ వర్షానికి లారీలు వెళ్లే పరి స్థితి లేదు. రోడ్డుకు తరలించే భారం కూడా రైతులే భరించాలని అధికారులు చెబుతున్నారు. రైతు పరిస్థితి మూ లిగే నక్కపై తాటిపండు పడ్డ సామేతలా తయారైంది. త్వరలోనే రుతుపవనాలు వస్తాయని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్న వేళ అధికార యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టి మొక్కజొన్నలను కొనుగోలు చేయాల్సి ఉంది. ధాన్యం రైతుల పరిస్థితి ఇందుకు భిన్నంగా లేదు. కాంటాలు వేసినా ఎగుమతి చేసే పరిస్థితి కన్పించడం లేదు. అధికారులు ధాన్యం, మొక్కజొన్న కొనుగోళ్లు, రవాణా పై దృష్టిసారించి రైతుల ఇబ్బందులను తొలగించాలి. తొలకరి వర్షాలతో తిరిగి వ్యవసాయ పనులు ప్రారంభించాల్సి ఉన్నందున నగదు కూడా తక్షణమే విడుదల చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

Comments

comments