Search
Friday 22 June 2018
  • :
  • :
Latest News

మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆత్మహత్య

Female Software Engineer Committed Suicide in Hyderabad

హైదరాబాద్ : మియాపూర్‌లో కీర్తన అనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆల్విన్‌కాలనీలోని తన నివాసంలో ఆమె ఆత్మహత్య చేసుకుంది. శ్రీధర్ అనే వ్యక్తితో తొమ్మిదేళ్ల క్రితం ఆమెకు పెళ్లి జరిగింది. శ్రీధర్ ఓ ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేసి మానేశాడు. ప్రస్తుతం ఆయన ఉద్యోగాన్వేషణలో ఉన్నాడు. ఈ క్రమంలో శ్రీధర్, కీర్తన దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. కుటుంబ కలహాల కారణంగానే కీర్తన ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో విచారిస్తున్నామని పోలీసులు వెల్లడించారు.

Female Software Engineer Committed Suicide in Hyderabad

Comments

comments