Search
Friday 22 June 2018
  • :
  • :
Latest News

గూడ్స్ రైలు ఇంజన్‌లో మంటలు

 Fire Accident in Goods Train in Nizamabad

నిజామాబాద్ క్రైం ః జిల్లా కేంద్ర రైల్వేస్టేషన్‌కు చేరుకున్న ఓ గూడ్స్ రైలు ఇంజన్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. ఈ విషయాన్ని గమనించిన ఆర్‌పిఎఫ్ సిబ్బంది, రైల్వే సిబ్బంది మంటలను ఆర్పివేశారు. దీంతో తృటిలో భారీ ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని రైల్వే అధికారులు తెలిపారు. ఇంజన్‌లో తలెత్తిన సాంకేతిక లోపంతోనే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని అధికారులు అంచన వేశారు.

Comments

comments