Search
Sunday 24 June 2018
  • :
  • :
Latest News

బహుళ అంతస్తు భవనంలో భారీ అగ్నిప్రమాదం

Fire broke out on the top floor of a High rise in Prabhadevi area in Mumbai

ముంబయి: దేశ ఆర్థిక రాజధాని ముంబయిలోని ప్రభాదేవి ప్రాంతంలో ఉండే బ్యూమాండే టవర్స్‌లో బుధవారం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ బహుళ అంతస్తు భవనంలోని బి-వింగ్‌లో 33వ అంతస్తులో అగ్ని ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఆరు అగ్నిమాపక యంత్రాల సాయంతో మంటలు అదుపు చేస్తున్నాయి. స్థానిక మీడియా సమాచారం ప్రకారం ఈ ఫ్లాట్లలోని 92 మందిని అగ్నిమాపక సిబ్బంది సురక్షితంగా బయటకు తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. అయితే, ఇదే టవర్స్‌లో బాలీవుడ్ నటి దీపికా పదుకునే ఓ ఫ్లాట్ ఉంది. ఆమెతో పాటు వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు కూడా ఈ భవనంలో నివాసముంటున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Comments

comments