Search
Wednesday 20 June 2018
  • :
  • :
Latest News

నాలుగు బస్సులు ఢీ: పదిమందికి గాయాలు

Two People Killed in Road Accident

నకిరేకల్: నల్లగొండ జిల్లా నకిరేకల్ మండలం చందంపల్లి వద్ద మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న ఆర్టిసి బస్సును ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది.  ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును వెనక వచ్చిన మరో రెండు బస్సులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో పది మంది ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై ట్రాఫిక్ స్తంభించిపోయింది. రోడ్డుపై ఉన్న వాహనాలను క్రేన్ సహాయంతో పక్కకు తొలగించారు.

Comments

comments