Search
Tuesday 19 June 2018
  • :
  • :

జర్నలిస్టుల పిల్లలకు ఉచిత విద్య…

mp kavitha condolence to labour deaths

నిజామాబాద్: జిల్లాలో విధులు నిర్వహిస్తున్న జర్నలిస్టుల పిల్లలకు ఉచిత విద్యను అందించే విధంగా చర్యలు తీసుకోవాలని ఎంపి కల్వకుంట్ల కవిత జిల్లా కలెక్టర్ ఎం.ఆర్.ఎం రావును ఆదేశించారు. మంగళవారం ప్రగతిభవన్ లో జరిగిన మైనార్టీ సంక్షేమశాఖ సమావేశంలో ఎంపి కవితతో పాటు డిప్యూటి సిఎం మహమూద్ అలీ, పలువురు అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంగారెడ్డి డిఇవొ జర్నలిస్టులకు ఉచిత విద్యనందించాలని జారీ చేసిన ఉత్తర్వులను ఎంపి కవిత, కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. అలాగే ఉర్దూ జర్నలిస్టుల కుటుంబ సభ్యుల సిఎంఅర్ఎఫ్ పెండింగ్ లో ఉన్న విషయాన్ని డిప్యూటి సిఎం  దృష్టికి తీసుకు వెళ్లారు. సిఎంఅర్ఎఫ్ నిధులు త్వరగా విడుదల చేయాలని ఎంపి కవిత కోరారు.

Comments

comments