Search
Friday 22 June 2018
  • :
  • :
Latest News

గందరగోళంగా వివిపి ఉద్యోగుల బదిలీలు

From 25 years to the same in the same place

25 సంవత్సరాల నుండి ఒకే చోట తిష్ట
20 శాతం తప్పనిసరి పేరిట అయోమయం
ఆందోళనలో వైద్య సిబ్బంది

మన తెలంగాణ/ఆదిలాబాద్ బ్యూరో : వైద్య విధాన పరిషత్(వివిపి)లో పని చేస్తున్న ఉద్యోగుల బదిలీల వ్యవహారం గందరగోళంగా మారిందన్న ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. ప్రస్తుతం నిర్మల్, భైంసా, ఆదిలాబాద్, ఖానాపూర్, మంచిర్యాల, బెల్లంపల్లి, కాగజ్‌నగర్ తదితర చోట్ల గల ప్రభుత్వ ఆసుపత్రుల్లో పని చేస్తున్న ఉద్యోగులకు కౌన్సిలింగ్ ద్వారా బదిలీ ప్రక్రియ నిర్వహిస్తున్నారు. దీని కోసం గాను 20 శాతం మంది ఉద్యోగులను మాత్రమే బదిలీ చేయాలన్న నిబంధనను రూపొందించారు. బదిలీలలోని ఈ అంశం ప్రక్రియకు ప్రధాన అవరోధంగా మారిందన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అయితే మొత్తం 411 మంది బదిలీల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరందరికి ఈనెల 14వ తేదీన కౌన్సిలింగ్ నిర్వహించనున్నారు. బదిలీల కోసం 20 శాతం ఉద్యోగులు మాత్రమే దరఖాస్తులు చేసుకోవాలని నిబంధనలో పేర్కొన్నారు. దీని ప్రకారం ప్రతి ఆసుపత్రి నుంచి అదే స్థాయిలో ఉద్యోగుల బదిలీలను నిర్వహించాల్సి ఉంది. 25 ఏళ్ల నుండి ఒకే చోట పని చేస్తున్న ఉద్యోగులు మాత్రం ఈ బదిలీల కోసం దరఖాస్తులు చేసుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది. అధికారుల అండదండలు, తమకు ఉన్న పలుకుబడి కారణంగా వీరు బదిలీల కోసం దరఖాస్తు చేసుకోకపోనప్పటికీ అధికారులు ఎలాంటి స్పందన కనబర్చకపోవడం చర్చనీయంశం అవుతోంది. ముఖ్యంగా ఖానాపూర్ ప్రభుత్వ ఆసుపత్రి నుంచి ఎవరూ దరఖాస్తు చేసుకోలేదు. నిబంధనల ప్రకారం ఈ సారి 60 నుంచి 70 మంది ఉద్యోగులు బదిలీ కావల్సి ఉంటుంది. అమాయకులైన ఉద్యోగులు ఈ అసంబద్ద విధానంతో నష్టపోతున్నారంటున్నారు. ప్రస్తుత పరిస్థితులపై అధికారులకు ఫిర్యాదులు చేసినప్పటికి స్పందించే వారే కరువయ్యారంటున్నారు. మొత్తానికి ఈ బదిలీ వ్యవహారంపై దర్యాప్తు జరిపి పకడ్బందీ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Comments

comments