Search
Saturday 23 June 2018
  • :
  • :
Latest News

నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయం

Gadari Kishore Speech About Thungathurthy constitute

మన తెలంగాణ/తుంగతుర్తి : తుంగతుర్తి నియోజకవర్గంలోని గ్రామాలు ఆవాస గిరిజన తండాల్లో లక్షలాది రూపాయల వ్యయంతో సిసి రోడ్ల నిర్మాణం జరుగుతోందని, నియోజక అభివృద్ధే తన ధ్యేయమని తుంగతుర్తి శాసన సభ్యులు డాక్టర్ గాదరి కిశోర్ కుమార్ అన్నారు. మంగళవారం తుంగతుర్తి మండలం బండరామారం గ్రామంలో రూ.25 లక్షల వ్యయంతో సిసి రోడ్ల పనులు ప్రారంభించిన అనంతరం బండరామారం ఆవాస తండాలైన మంచతండా, సూర్యతండా, గుట్టకింది తండా, మీసాల భీమ్లా తండా ,సీతారాం తండా, నక్కభిక్షం తండా, ధరావత్ తండాలలో ఒక్కొక్క తండాలలో రూ.10 లక్షల వ్యయంతో నిర్మాణం కాగల సిసి రోడ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేసిన అనంతరం మాట్లాడారు . ఈ సందర్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ చేపడుతున్న గ్రామాల అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా నేడు బండరామారంతో పాటు ఆవాస తండాలలో 85 లక్షలు, వెంపటి గ్రామంతో పాటు ఆవాస తండాలలో రూ.45 లక్షల తో సిసి రోడ్డు నిర్మాణాలు చేపట్టామని అన్నారు. తుంగతుర్తి నియోజక వర్గం దశాబ్దాల కాలంగా అభివృద్ధికి ఆమడ దూరంలో ఉందని , గడిచిన మూడున్నర సంవత్సరాల కాలంలో మునుపెన్నడూ జరగని అభివృద్ధి ,సంక్షేమ కార్యక్రమాలు కోట్లాది రూపాయలు వెచ్చించి చేపట్టామని అన్నారు.   రైతులకు 24 గంటల విద్యుత్ సరఫరా కోసంలో ఓల్టేజి  లేకుండా నియోజక వర్గ వ్యాప్తంగా అనేక సబ్ స్టేషన్‌లు మంజూరి చేయడం ,ప్రస్తుతం సబ్ స్టేషన్‌లలో విద్యుత్ సరఫరా జరుగుతోందని అన్నారు. కార్యక్రమంలో పంజాయితీ రాజ్ డిఇ ప్రభాకర్ , తహశీల్ దార్ వెంకన్న, జిల్లా రైతు సమన్వయ సమితి కో-ఆర్డినేటర్ ఎస్.ఎ రజాక్, ఎంపిపి స్వాతి తేజానాయక్, టిఆర్‌ఎస్‌వి జిల్లా కన్వినర్ కల్లెట్ల పల్లి శోభన్ బాబు, టిఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షులు గుడిపాటి సైదులు ,బండరామారం సర్పంచ్ సైదులు ,వెంపటి సర్పంచ్ నాగయ్య, టిఆర్‌ఎస్ నాయకులు దాయం విక్రం రెడ్డి, గుడ్ల వెంకన్న,తాటికొండ సీతయ్య, వెంకటనారాయణ, గడ్డం ఉప్పలయ్య, గుండగాని రాములు , నల్లు రాంచంద్రారెడ్డి, తునికి సాయిలు, గునిగంటి సంతోష్ ,గోపగాని శ్రీనివాస్, ఆకారం భాస్కర్, తదితరులు పాల్గొన్నారు.

Comments

comments