Search
Saturday 23 June 2018
  • :
  • :
Latest News

తెరాస హాయాంలోనే గద్వాల్ అభివృద్ధి

gadwal development in TRS government
గద్వాల: అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కెసిఆర్ అహర్నిషలు కృషి చేస్తున్నారని ఇందుకోసం వివిధ రకాల సంక్షేమ పథకాలను అమలు చేస్తూ బంగారు తెలంగాణ కోసం పాటుపడుతున్నారని జట్పీఛైర్మన్ బండారీభాస్కర్, తెరాస రాష్ట్ర కార్యదర్శి బండ్లకృష్ణమోహన్‌రెడ్డిలు అన్నారు. గట్టు ఎత్తిపోతల పథకానికి ముఖ్యమంత్రి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చి జివొ జారి పట్ల గద్వాల్ నియోజకవర్గ ప్రజల తరపున ముఖ్యమంత్రి కెసిఆర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నట్టు వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు గద్వాల్ పట్టణంలో మోటారు సైకిల్ ర్యాలీ చేపట్టారు. అనంతరం వారు పాతబస్టాండు వద్ద సిఎం కెసిఆర్, మంత్రులు హరీష్‌రావు, కెటిఆర్, జూపల్లి, బండ్లకృష్ణమోహన్‌రెడ్డిలతో కూడిన చిత్రపటానికి పాలభిషేకం చేశారు. అనంతరం పార్టీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ధరూరు మండలం మైలగడ్డ గ్రామానికి చెందిన 100 మంది కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు తెరాసలో చేరారు. ఈసందర్భంగా గత నాలుగేళ్లుగా ప్రభుత్వం చేపడుతున్న వివిధ రకాల అభివృద్ధి పనులను చూసి తెరాస పార్టీలో వచ్చి చేరుతున్నట్టు తెలిపారు. గద్వాల్ లో కాంగ్రెస్ పార్టీ హయాంలో నాయకులకు అభివృద్ధి జరిగింది తప్ప గద్వాల కు ఒరిగిన ప్రయోజనం ఏమిలేదన్నారు. రానున్న ఎన్నికల్లో గద్వాల్ కాంగ్రెస్ పార్టీని ఓడించి తెరాస జెండా ఎగురవేయడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ ఛైర్మన్ బిఎస్ కేశవ్, రైతు సమన్వయ జిల్లా కన్వీనర్ వెంకట్రాములు,జట్పిటిసి భాస్కర్, ధరూరు నర్సింహారెడ్డి, రఘురెడ్డి, క్రాంతి, పూడూరు చిన్నయ్య తదితరులు పాల్గొన్నారు.

Comments

comments