Search
Sunday 24 June 2018
  • :
  • :
Latest News

ప్రజారోగ్యంతో నకిలీ ఉత్పత్తుల చెలగాటం

eatala

మంత్రి ఈటల రాజేందర్ 

మన తెలంగాణ/ హైదరాబాద్: మార్కెట్‌లో నకిలీ ఉత్పత్తులతో ప్రభుత్వానికి పన్ను రాబడి రాకపోగా ప్రజల ఆరోగ్యాన్ని కబళిస్తోందని ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఆందోళన వ్యక్తం చేశారు. నకిలీ ఉత్పత్తులు అసలైన ఉత్పత్తులకు సవాలు విసురుతున్నాయని, దీనికి అడ్డుకట్ట వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిబద్ధతతో పనిచేస్తుందని, ఇందుకు వివిధ సంస్థలు, ఉత్పత్తిదారులు తమ వంతు సహాకారాన్ని అందించాలన్నారు. ఫిక్కీ కాస్కేడ్(కమిటీ ఎగనెస్ట్ స్మగింగ్ అండ్ కౌంటర్‌ఫిటింగ్ యాక్టివిటీస్ డెస్ట్రాయింగ్ ద ఎకన మీ) ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో మంగళవారం ‘నకిలీలు, స్మగ్లింగ్‌ఆర్థికాభివృద్ధి’ అనే అంశంపై జరిగిన సదస్సుకు మంత్రి ఈటల రాజేందర్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. చట్టాలు, పలు ఉత్తర్వుల అమలుకు పాలకులు, ప్ర భుత్వ యంత్రాంగం సంయుక్త ంగా నిబద్దతతో పనిచేస్తే మంచి ఫలితాలు వస్తాయని, దీనికి తెలంగాణ రాష్ట్ర ప్రభు త్వం కేంద్ర బిందువుగా నిలుస్తుందన్నారు. నకిలీ ఆహారపదార్ధాలు, మందు బిల్ల తయారీతో ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని, వారిలో విశ్వాసాన్ని కల్పించడం కేంద్ర, రాష్ట్ర పాలకుల కనీస బాధ్యత అని చెప్పారు. గుడుంబా వ్యాపారం ద్వారా కొం దరు జీవితాల్లో వెలుగులు నిండినప్పటికీ చాలా మంది జీవితాలను చిధ్రం చేసిందని, అందుకే గుడుంబాపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపిందని వివరించారు. నకిలీ మందుల వా డకం ద్వారా వ్యాధి ముదిరి మంచాన పడుతుంటే, మరికొందరు మరణిస్తున్నారని, మార్కెట్‌లో నకిలీ ఉత్పత్తులు ఉన్న ట్టు తెలియదా అంటే అందరికీ తెలుసని, కాని దీనిని నియంత్రించేందుకు పాలకులు నిబద్ధతో పనిచేయాలని, అందుకు అందరూ సహకరించాలని అభిప్రాయపడ్డారు. రూ.20వేల విలువ చేసే ఐఫోన్‌లో ఉండే అన్ని సౌకర్యాలూ రూ.2వేలకు లభించే చైనా ఫోన్‌లో కూడా లభిస్తుందని, ఇది అందరికీ తెలిసిన రహస్యమేననిపేర్కొన్నారు. నకిలీలతో పాటు ఏ నేరం జరిగినా వాటిని అరికట్టేందుకు హైదరాబాద్ పోలీసు వ్యవస్థ సమర్ధవంతంగా పనిచేస్తుందన్నారు.
ప్రస్తుతం సృష్టిస్తున్న సంపద అనుకున్న లక్షాన్ని చేరుకోలేకపోతుందని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. సంపద కంటే కూడా ప్రజల ఆరోగ్యమే ముఖ్యమనే భావన అందరిలో రా వాలన్నారు. కస్టమ్స్ ప్రిన్సిపల్ కమిషనర్ అనిల్‌కుమార్ జై న్ మాట్లాడుతూ నకిలీ ఉత్పత్తులకు వ్యతిరేకంగా అన్ని సంస్థలూ ఒకతాటిపైకొచ్చి పనిచేయాలని, ఇందులో అందరూ భాగస్వాములు కావాలన్నారు. అమెరికాలో నకి లీ ఉత్పత్తులను అరికట్టేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ కీలకంగా పనిచేస్తుందన్నారు. వివిధ రకాల వస్తువులను కొనుగోలు చే స్తే కొందరు బిల్లులు కూడా తీసుకోవడం లేదన్నారు. ఫిక్కీ ఛైర్మన్ దేవేందర్ సురానా మాట్లాడుతూ నకిలీ ఉత్పత్తులు తీ వ్రమైన సమస్యగా, అక్రమ వాణిజ్యంగా నిలుస్తుందన్నారు. ఫీక్కి సలహాదారులు పి.సి. జా ఇతరులు పాల్గొన్నారు.

Comments

comments