Search
Friday 22 June 2018
  • :
  • :
Latest News

సిఎం కెసిఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం

Golden Telangana Captain Chief Minister KCR
కరీంనగర్: కొత్తపల్లి మండలంలోని రేకుర్తి గ్రామంలో సర్పంచ్ నందెల్లి పద్మ-ప్రకాశ్ ఆధ్వర్యంలో రాష్ట్ర ఆవతరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. త్రివర్ణ పతకం వేగర వేసి, ఆనంతరం అంబేద్కర్ విగ్రహం వద్ద బంగారు తెలంగాణ సారధి, ఉద్యమ సారధి, ముఖ్య మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు చిత్రపటానికి క్షిరాభిషేకం సర్పంచ్ నందెల్లి పద్మ-ప్రకాశ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ నందెల్లి పద్మ-ప్రకాశ్ మాట్లాడుతూ తెలంగాణ ప్రజల చిరాకాల వాంఛ అయిన తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చిన ఉద్యమ నాయకుడని, నాలుగు సంవత్సారాలతో బంగారు తెలంగాణవై ఆడుగులు వేస్తున్న నాయకుడని కొనియాడారు. కెసిఆర్ ఆయురారోగ్యాలతో ఉండాలని మరింత కాలం తెలంగాణ రాష్ట్రానికి ముఖ్య మంత్రి కెసిఆర్ సేవలందించాలని ఆకాంక్షించారు. కరీంనగర్ ఎమ్మెలే గంగుల కమలాకర్ చొరవతో రేకుర్తి గ్రామం అభివృద్ది ముందుకు సాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిటిసి రాజశేఖర్, వార్డు సభ్యులు రాచకొండ నరేష్, రజక సంఘం అధ్యక్షులు పొన్నాల తిరుపతి,  తదితరులు పాల్గొన్నారు.

Comments

comments