Search
Sunday 24 June 2018
  • :
  • :
Latest News

ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్య

Good Education In Govt Schools In telangana

మన తెలంగాణ/బషీరాబాద్ : తెలంగాణ ప్రభుత్వ ప్రభుత్వ పాఠశాలలో మెరగైన విధ్యను అందించడానికి కృషి చేస్తుందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి అన్నారు.గురువారం మంత్రి బషీరాబాద్ మండలం గొట్టిగ కుర్దు గ్రామంలో ఉన్న ఉన్నత పాఠశాలలో సికిందరాబాద్ రోటరి క్లబ్ వారు సుమారు 150 మంది విధ్యార్థినిలకు సైకిళ్లను పంపిణి చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అథితిగా హాజరైన మంత్రి సైకిళ్లను పంపిణి చేసిన అనంతరం మాట్లాడుతు ప్రభుత్వ పాఠశాలకు స్వఛ్చంద సంస్థలు సహాకారం అందించడం అభినందనీయమన్నారు.అదే విధంగా ప్రభుత్వ పాఠశాలలో సైతం మెరుగైన విధ్యను అందించడానికి కృషి చేస్తున్నామని అన్నారు.ఈ విధ్యాసంవత్సరం ప్రారంభంలోనే పాథ్యపుస్తకాలను పంపిణి చేసినట్లు తెలిపారు.పాఠశాలలో ఉన్న ఉపాధ్యాయుల పోస్టులను సైతం త్వరలో భర్తి చేస్తామని చెప్పారు.అప్పటి వరకు విధ్యావాంటర్లను నియమిస్తున్నామని అన్నారు.అనంతరం మంత్రి మండల పరిధిలోని కొత్తగా ఏర్పాటు చేసిన కుప్పన్‌కోట్,బాద్లాపూర్,బాద్లాపూర్ తండా,పెద్ద గొట్టిగ,బాబునాయక్ తండా.బోజ్యనాయక్ తండా,అంఖ్యా నాయక్ తండా,మర్పల్లి,ఇస్మాయిల్ పూర్ గ్రామాలలో పర్యటించారు.సిఎం కేసిఆర్ ఇచ్చిన మాట ప్రకారం కొత్త గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేశారని అన్నారు,అయితె కొత్త గ్రామ పంచాయతీలను సాధ్యమైనంత వరకు ఏకగ్రీవం చేసి సిఎంకు కానుకగా ఇవ్వాలని సూచించారు.ఆయా గ్రామాలలో ప్రజలతో సమస్యలపై మాట్లాడారు.ఈ కార్యక్రమంలో డిఇఓ రేణుక,ఎంఇఓ నర్సింగ్‌రావు,టిఆర్‌ఎస్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి,అజయ్ ప్రసాద్,వెంకట్‌రాంరెడ్డి పాల్గోన్నారు.

Comments

comments