Search
Wednesday 20 June 2018
  • :
  • :
Latest News

సిట్టింగ్ లకు సీట్ పరేషాన్!

Good response from the public

మన తెలంగాణ, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి :
తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న ప్రజా సంక్షేమ పథకాలకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది. ప్రభుత్వ పథకాలతో పాటు తెలంగాణ సియం కెసిఆర్‌కు ప్రజలు నీరాజనం పడుతున్న , ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకుపోవడంలో విఫలమవుతున్న ఎమ్మెల్యేల పుణ్యమా ఉమ్మడి జిల్లాలోని ఆరు నియోజకవర్గాలలో పార్టీకి ఇబ్బందులు వచ్చే పరిస్థీతులు కనిపిస్తున్నాయని ప్రచారం జరుగుతుంది. రాష్ట్రంలో ఎమ్మెల్యేల పనితీరుపై ఎప్పటికప్పుడు సర్వేలు నిర్వహించి ప్రజల నాడిని పసిగట్టి దానికి అనుగుణంగా ముందుకు నడిచే సియం కెసిఆర్ తాజాగా నిర్వహించిన సర్వే ఫలితాల ఆదారంగా తగు చర్యలు చేపడుతున్నట్లు తెలిసింది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో పరిగి, ఉప్పల్, ఎల్.బి.నగర్ మినహ మిగత 11 నియోజకవర్గాల్లో గులాబీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సిట్టింగ్ శాసనసభ్యులపై నిర్వహించిన సర్వేలో అయిదుగురు సేఫ్‌జోన్‌లో ఉండగా మిగత వారిపై మిశ్రమ ఫలితాలు వచ్చినట్లు ప్రచారం జరుగుతుంది. కొంత మంది ప్రభుత్వ కార్యక్రమాలలో పాల్గొంటు జనం మద్యలో ఉంటున్న స్థానికంగా గ్రూపు రాజకీయాల మూలంగా పార్టీకి ప్రభుత్వంకు చెడ్డపేరు వస్తుందని తెలిసింది. రంగారెడ్డి జిల్లాలోని కాలే యాదయ్య(చెవెళ్ళ), ప్రకాష్ గౌడ్( రాజేంద్రనగర్), మంచిరెడ్డి కిషన్ రెడ్డి (ఇబ్రహింపట్నం) ,తీగల క్రిష్ణారెడ్డి( మహేశ్వరం), అంజయ్య యాదవ్ (షాద్‌నగర్) ల పనితీరు మరింత మెరుగుపరుచుకోవలసిన అవసరం ఉందని సర్వేలలో తెలినట్టు ప్రచారం జరుగుతుంది. ప్రభుత్వ పథకాలను వివరించి సంక్షేమ పథకాలను ప్రజల దగ్గరికి తీసుకుపోవడంతో పాటు క్యాడర్‌లో మరింత జోష్ తీసుకురాకపోతే ఐదుగురు ఎమ్మెల్యేలకు వచ్చే ఎన్నికలలో గడ్డుకాలం తప్పకపోవచ్చు. మేడ్చల్ జిల్లాలో సుధీర్ రెడ్డి( మేడ్చల్), మాదవరం క్రిష్ణారావు (కూకట్‌పల్లి)ల పనితీరుపై సర్వేలో సంతృప్తికరంగా ఫలితాలు రాలేదని ప్రచారం జరుగుతుంది.
వర్గపోరుతోనే డీలా…
ప్రభుత్వ పథకాలకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తున్న వర్గపోరు పార్టీ పరువు తీస్తుంది. చెవెళ్ళ, రాజేంద్రనగర్, ఇబ్రహింపట్నం, మహేశ్వరం, షాద్‌నగర్ నియోజకవర్గాల్లో వాస్తవంగా ఎమ్మెల్యేలు ప్రతి నిత్యం ప్రభుత్వ కార్యక్రమాల్లో భాగస్వాములు అవుతు జనం మద్యలో ఉంటున్న ప్రతి నియోజకవర్గాలలో 2019 ఎన్నికలలో పోటిచేయడానికి ఆశావాహూల సంఖ్య అధికంగా ఉండటంతో ఎవరికి వారు స్వతహగా పార్టీ కార్యక్రమాలు నిర్వహించడం మూలంగా ప్రజల్లో పార్టీ ప్రతిష్ట మసకబారుతుందని టిఆర్‌యస్ పార్టీ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెవెళ్లలో ఎమ్మెల్యే కాలే యాదయ్యకు వ్యతిరేకంగా మాజీ ఎమ్మెల్యే రత్నం ప్రజల్లోకి దూసుకుపోతున్నారు. రాజేంద్రనగర్‌లో ప్రకాష్‌గౌడ్‌తో పాటు మరో ముగ్గురు నేతలు టికెట్‌లు ఆశీస్తున్నారు. ఇబ్రహింపట్నంలో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ప్రతి రోజు నియోజకవర్గంలో పర్యటించడంతో పాటు కోట్ల రూపాయలతో అభివృద్ది కార్యక్రమాలు చేపడుతున్న ఆయనకు వ్యతిరేకంగా చంద్రశేఖర్ రెడ్డి, శేఖర్ గౌడ్, నిరంజన్ రెడ్డిలతో పాటు పలువురు టికెట్ వేటలో మునిగి స్వతంత్రంగా పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మహేశ్వరంలో ఎమ్మెల్యే తీగల క్రిష్ణారెడ్డితో పాటు ఆయన కోడలు అనితారెడ్డి, గత ఎన్నికలలో పోటిచేసిన మనోహర్ రెడ్డి, కప్పాటి పాండురంగారెడ్డిలు టికెట్ ఆశీస్తున్నారు. షాద్‌నగర్‌లో ఎమ్మెల్యే అంజయ్య యాదవ్‌తో పాటు వీర్లపల్లి శంకర్, అందె బాబయ్య, మిథున్ రెడ్డి, నరెందర్ రెడ్డి తదితరులు టికెట్ ఆశీస్తు ఎవరికి వారే యమునా తీరుగా వ్యవహరిస్తున్నారు. జిల్లా మంత్రితో పాటు పార్టీలోని పెద్దలు నియోజకవర్గాల వారిగా గ్రూప్‌ల మద్య రాజీ చేయవలసిన అవసరం చాలా వరకు ఉంది. వర్గపోరు మూలంగా పార్టీ ప్రజలలో చులకన అవడంతో పాటు వచ్చే ఎన్నికలలో ఇబ్బందులు వచ్చే పరిస్థీతులు కనిపిస్తున్నాయి.

Comments

comments