Search
Friday 22 June 2018
  • :
  • :
Latest News

శివసాగర్ ప్రాజెక్టుకు రూ.12 కోట్లు

  Government 12 Crore Provide To Shiva Sagar Project

మన తెలంగాణ / వికారాబాద్ జిల్లా ప్రతినిధి : రాష్ట్రంలోని ప్రతి ఎకరా భూమికి నీటిని అందించి సాగులోకి తెస్తామని రవాణాశాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం నెరవేర్చే దిశగా అడుగులు పడుతున్నాయని చెప్పారు. యాలాల మండలంలో పెండింగులో ఉన్న శివసాగర్  ప్రాజెక్టు పూర్తి చేసేందుకు రివైజ్ట్ ఎస్టిమేషన్ ప్రకారం రూ.12 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు ఆయన వెల్లడించారు. మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు. శివసాగర్ పూర్తి చేసేందుకు సిఎం ప్రత్యేక చొరవ తీసుకుని రూ.12 కోట్లు (జీవో 776) మంజూరు చేయించారని తెలిపారు. జిల్లాలోని అన్ని ప్రాంతాలకు సమానంగా నిధులు కేటాయిస్తున్నామని చెప్పారు. తాండూరు ప్రాంతంలో రైతుల ఆకాంక్ష నెరవేర్చే దిశగా ముందుకు సాగుతున్నామని అన్నారు.  ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుతున్నామని తెలిపారు. 30 ఏళ్ల క్రితమే శివసాగర్ ప్రాజెక్టు కోసం ప్రతిపాదనలు పంపించినా 2005లో  శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు. వెయ్యి ఎకరాలకు సాగునీరు అందించాలన్న లక్షంగా ప్రాజెక్టు పనులు ప్రారంభించినా అనివార్య కారణాల వల్ల పలుమార్లు ఆగిపోయిందన్నారు. యాలాల, విశ్వనాథపురం, రాఘవాపూర్, కోకట్ తదితర గ్రామాలకు శివసాగర్ నీటిని అందిస్తామని తెలిపారు. ప్రాజెక్టు కట్ట నిర్మాణ పనులు పూర్తయ్యాయని చెప్పారు. కాల్వల కోసం  భూములు సేకరించామన్నారు. ప్రాజెక్టు కోసం భూములు కోల్పోయిన రైతన్నలకు నష్టపరిహారం అందించామని తెలిపారు. ప్రస్తుతం మంజూరు చేసిన నిధులతో పనులు ప్రారంభించేందుకు త్వరలో టెండర్లు పిలుస్తామని మంత్రి వెల్లడించారు. ఆరు మాసాల్లో పనులు పూర్తి చేసి వచ్చే యేడాది రైతులకు ఉపయోగపడేలా చేస్తామని స్పష్టం చేశారు. పాలమూరు  రంగారెడ్డి ప్రాజెక్టుకు త్వరలో మోక్షం లభిస్తుందని ఆకాంక్ష వ్యక్తం చేశారు.  కాంగ్రెస్ నేతలు వేసిన కేసుల కారణంగా ప్రాజెక్టులు ఆగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మధ్యతరహా ప్రాజెక్టులకు, చిన్న చెర్వులకు మిషన్‌కాకతీయ కింద అదనపు నిధులు కేటాయిస్తామని తెలిపారు.  తాండూరులో గొల్ల చెర్వును మినీ ట్యాంకుబండ్‌గా నిర్మిస్తున్నామని మంత్రి మహేందర్‌రెడ్డి వివరించారు.

Comments

comments