Search
Friday 22 June 2018
  • :
  • :
Latest News

వికలాంగులు ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకోవాలి

 Government Schemes For Disabled People

మనతెలంగాణ/నిజామాబాద్ బ్యూరో
తెలంగాణ ప్రభుత్వం దివ్యాంగులకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందని వాటిని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎం. రామ్మోహన్‌రావు అన్నారు. ఆదివారం న్యాల్‌కల్ రోడ్డులోని నిజామాబాద్ రోటరి కమ్యూనిటీ హల్ రోటరీ క్లబ్ నిజామాబాద్ పూణే రోటరీ క్లబ్ సంయుక్తంగా నిర్వహించిన ఉచిత కృత్రిమ చేతి అమర్చే కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రమాదవశాత్తు చేతు కోల్పోయిన బాధితులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. మోచేయి తర్వాత అరచేతికి మధ్య లో కనీసం నాలుగు అంగుళాల చేతి భాగం ఉన్న వారికి ఈ కృత్రిమ చేతి అమర్చడం వల్ల వారు రాయడం, తినడం, సాధారణంగా మిగతా కార్యక్రమాలు సులువుగా చేసుకోవడానికి సౌకర్యంగా ఉంటుందన్నా రు. రోటరీ క్లబ్ వారు ఇచ్చిన ప్రచారం వల్ల వివిధ జిల్లాల నుండి సుమా రు 200 మంది రిజిస్టర్ చేయించుకున్నారని వారిలో 110 మందికి కృత్రిమ చేతి అమర్చి కొంత శిక్షణ ఇస్తున్నారని తెలిపారు. మిగతా వారికి మోచేతి కిందిభాగం 4 ఇంచులకు తక్కువ ఉన్నందున ఇప్పుడు వారి కొలతలు తీసుకొని తొందరలో వారికి కృతిమ చేతిని అమర్చుతామని అన్నారు. ఇప్పుడు మోచేయి తర్వాత అరచేతికి మధ్యలో కనీసం నాలుగు అంగుళాల చేతి భాగం ఉన్న 110 మందికి అమర్చడం జరిగిందన్నారు. ప్రభుత్వం దివ్యాంగుల కోసం మూడు చక్రాల సైకిళ్లు, చిన్న పిల్లలకు భవి సెంటర్స్ ఏర్పాటు చేసిందని తెలిపారు. రోటరీ క్లబ్ జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ రోటరీ క్లబ్ ఏర్పాటు చేసి 65 సంవత్సరాలు అయిందని వివిధ రకాల సేవలు అందిస్తున్నారని కమ్యూనిటీ హాల్‌కు 3వేల రూ.లను ఇస్తున్నామని తెలిపారు. వచ్చిన బాధితులకు ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేయడమైందని అన్నారు.
జిల్లా కలెక్టర్ రోటరీ క్లబ్ ప్రతినిధులను అభినందించారు. చేయి లేదనే భావన ఉండదని అన్నారు. అనంతరం జ్ఞాపికలను అందజేశారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ సభ్యులు శివ శంకర్‌రెడ్డి, డి. గౌతం, సుధీర్, అశోక్, ప్రసాద్, సి. చంద్రశేఖర్, ఎస్‌విఎస్ మెడికల్ కళాశాల మహబూబ్‌నగర్ నర్సింగ్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Comments

comments