Search
Saturday 23 June 2018
  • :
  • :
Latest News

హెచ్‌డిఎఫ్‌సి నిధుల సమీకరణకు గ్రీన్‌సిగ్నల్

 Green signal for HDFC fund raising

న్యూఢిల్లీ: వ్యాపార విస్తరణ కోసం ఎఫ్‌డిఐ(విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు) ద్వారా రూ.24 వేల కోట్లు సమీకరించాలనే హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ప్రతిపాదనకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ నిధుల సేకరణతో బ్యాంక్‌లో ఎఫ్‌డిఐ వాటా రెగ్యులేటరీ గరిష్ఠ పరిమితి 74 శాతాన్ని చేరుకుంటుంది. ఈమేరకు ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన కేబినెట్ సమావేశం ముగిసిన అనంతరం మీడియాతో కేంద్ర ఆర్థికమంత్రి పియూష్ గోయల్ వివరాలను వెల్లడించారు. హెచ్‌డిఎఫ్‌సిలో ఎఫ్‌డిఐ వాటా 72.62 శాతంగా ఉందని, ఆర్‌బిఐ నిబంధనల ప్రకారం విదేశీ పెట్టుబడులు 74 శాతం మించకూడదని తెలిపారు. ప్రతిపాదించిన పెట్టుబడితో బ్యాం క్ మూలధన నాణ్యత నిష్పత్తి పటిష్టమవుతుందని అన్నారు. అదనంగా రూ.24 వేల కోట్లు, ప్రిపరెన్షియల్ ఆధారంగా హెచ్‌డిఎఫ్‌సి ప్రమోటర్లకు రూ.8,500 కోట్లు కేటాయించారు. మిగతా నగదును ఈక్విటీ షేర్లు, కన్వర్టబుల్ సెక్యురిటీస్ ద్వారా సమీకరిస్తామని హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ప్రకటించింది. విదేశీ పెట్టుబడుల నుంచి రూ.10 వేల కోట్లు సేకరించాలని హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ప్రతిపాదనకు 2015లో జరిగిన కేబినెట్ మీటింగ్‌లో ఆ మోదం లభించిదన్న విషయాన్ని గుర్తుచేశారు. బ్యాంకుల్లో విదేశీ పెట్టుబడుల వాటాలు 74 శాతం వాటాలను మించకూడదు.. అయితే గతంలో రూ.10 వేల కోట్ల పరిమితికి మించి ఈసారి హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌కు అనుమతి లభించింది.

Comments

comments