Search
Friday 22 June 2018
  • :
  • :
Latest News

గుట్కా ప్యాకెట్ల పట్టివేత

gutkha packets seized in adilabad

తలమడుగు: రాష్ట్రంలో నిషేధించబడ్డ గుట్కా ప్యాకెట్లను మహారాష్ట్ర నుండి తరలిస్తున్న ఎస్‌కె అలీంను పోలీసులు అరెస్టు చేశారు.  ఎస్సై సుబ్బారావు  తెలిపిన వివరాల ప్రకారం… ఆదిలాబాద్‌కు చెందిన ఎస్‌కె అలీం మహారాష్ట్ర నుండి దాదాపు 50 వేల విలువ గల గుట్కా ప్యాకెట్లను మహేంద్ర మ్యాక్స్ నెం ఎపి04టివి0149 వాహనంలో ఆదిలాబాద్‌కు తరలిస్తుండగా ముందస్తు సమాచారం మేరకు సుంకిడి గ్రామం వద్ద మాటు వేసి పట్టుకున్నట్టు ఎస్సై తెలిపారు. గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకొని నిందితుడిని రిమాండ్‌కు పంపించినట్టు ఎస్సై  పైడి సుబ్బరావు తెలిపారు.

Comments

comments