Search
Tuesday 19 June 2018
  • :
  • :

దేశానికే సిఎం కెసిఆర్ ఆదర్శం : గుత్తా

Gutta Comments on Rythu Bima

నల్లగొండ : తెలంగాణ సిఎం కెసిఆర్ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నారని రాష్ట్ర రైతు సమన్వయ సమితి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం కెసిఆర్ అనేక పథకాలు ప్రవేశపెట్టారని ఆయన పేర్కొన్నారు. రైతు బంధు, రైతు భీమా పథకాలు చరిత్రాత్మకమైనవని ఆయన పేర్కొన్నారు. దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలో రైతు బీమా పథకం అమలు చేస్తున్నామని, ఈ పథకం ద్వారా 58లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరుతుందని ఆయన చెప్పారు. అనుకోకుండా రైతు మరణిస్తే పది రోజుల్లోనే ఆ రైతు కుటుంబానికి రూ.5లక్షలు అందిస్తామని ఆయన చెప్పారు. ఆగస్టు 15వ తేదీ నుంచి రైతు బీమా పథకం అమలవుతుందని ఆయన వెల్లడించారు. ప్రజా రంజక పాలన చేస్తున్న కెసిఆర్‌పై కాంగ్రెస్ నేతలు చేసే తప్పుడు ఆరోపణలను ప్రజలు నమ్మరని గుత్తా స్పష్టం చేశారు.

Gutta Comments on Rythu Bima

Comments

comments