Search
Wednesday 20 June 2018
  • :
  • :
Latest News

యాదాద్రికి పోటెత్తిన భక్తజనం

Huge Devotees Visit the Laxmi narasimha Swamy Temple
మనతెలంగాణ/ యాదాద్రి : కొలిచిన వారికి కొంగు బంగారంలా వరాలిస్తూ నిత్యపూజలు అందుకుంటూ జగద్రక్షణ గావిస్తున్న శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి దర్శనార్థం తరలివస్తున్న భక్తుల రద్దీ యాదాద్రిలో కొనసాగుతూనే ఉంది. వేసవి సెలవులు ముగుస్తుడండంతో గత కొన్ని రో జులుగా భక్తుల రద్దీ కొనసాగుతుండగా ఆదివారం వా రాంతపు సెలవు కావడంతో స్వామి వారిని దర్శిం చుకో వడానికి పిల్లాపాపలతో స్వామి వారిని దర్శించుకోవడానికి వివిధ ప్రాంతాల నుండి భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు. భక్తుల వరుస రద్దీతో యా దగిరికొండపై సందడి నెలకొంది. భక్తుల రద్దీ దృష్టా ఆలయ అధికారులు తెల్లవారుజామున ఆలయాన్ని తెరి చి సుప్రభాత సేవ, అభిషేక, అర్చన నిత్య పూజా కార్యక్రమాలతో చేపట్టి 5.15గంటల నుండి సర్వదర్శనాలు ప్రార ంభించారు. స్వామి వారి దర్శనార్థం వచ్చిన భక్తులు తమ మొక్కుబడిగా తలనీలాలను సమర్పించుకొని విష్ణు పుష్క రిణిలో స్నానమాచరించి స్వామి వారి కళ్యాణ సేవ, శ్రీసత్యనారాయణ స్వామివారి వ్రతపూజలు, అర్చన, అభిషేక పూ జా కార్యక్రమాల్లో భక్తులు పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు. కళ్యాణ కట్ట, ప్రసాదాల క్యూలైన్, దర్శన క్యూ లైన్ లలో వ్రతపూజల వద్ద ఆలయ పరిసర ప్రాంతాలలో ఉదయం నుండి భక్తుల సందడి నెలకొంది. శ్రీవారి అనుబంధ ఆలయాలైన పాతగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో కూడాభక్తుల సందడి నెలకొంది. యాదగిరికొండకు వచ్చిన భక్తులలో దాదాపు 60శాతం భక్తులు శ్రీపాతగుట్ట స్వామి వారిని దర్శించుకొని పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
గుట్ట నిత్యరాబడి 33.19లక్షలు
శ్రీలక్ష్మీనరసింహ స్వామి వారి దేవస్థానం స్వామివారి నిత్యరాబడిలో భాగంగా ఆదివారం 33 లక్షల 19 వేల 622 రూపాయలు ఆదాయం వచ్చినట్లు ఆలయ కార్యనిర్వాహణ అధికారి తెలిపారు. ప్రధాన బుకింగ్ ద్వారా 1,45,426 రూపాయలు, అతిశీగ్ర దర్శనంలో 68,100 రూపాయలు, వ్రతాలు 1,70,500, కళ్యాణ కట్ట 82,000 రూపాయలు, ఎంక్వైరీ 1,09,390 ప్రసాదాలు 14,21,720, అన్న ప్రసాదం 12,851, వాహన పూజలు 30,500, టోల్‌గేట్ 3,290 రూపాయలు, శాశ్వతపూజలు 12,000, విఐపి దర్శనానికి 10,59,750 రూపాయలు రాగ యాదగిరిగుట్ట దేవస్థానం, శ్రీపాతలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయాల నుండి వివిధ శాఖల ద్వారా ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు.

Comments

comments