Search
Sunday 24 June 2018
  • :
  • :
Latest News

యాదాద్రిలో భారీ వర్షం..

Huge Rain Fall In Yadadri District

యాదాద్రి: యాదగిరిగుట్ట పట్టణ కేంద్రంతో పాటు మండల పరిధిలో బుధవారం రాత్రి భారీ వర్షం కురిసింది. రాత్రి 9: 30 గంటల ప్రాంతాన గాలులు వీస్తు భారీ వర్షం కురవడంతో విద్యుత్ అంతరాయంతో పాటు పలు చెట్లు విరిగి పడటం మామిడి కాయలు రాలడం వంటివి జరిగాయి. మండల కేంద్రంలో భారీగా వీచిన గాలి వర్షానికి విద్యుత్ సరఫరా పూర్తిగా రాత్రి నుండే నిలిచిపోయి గురువారం ఉదయం 6 గంటలకు తిరిగి సరఫరా కావడంతో రాత్రి పూట చీకట్లో విద్యుత్ లేక పట్టణ ప్రజలు ఇబ్బందులు పడ్డారు. మండంలోని సైదాపురం గ్రామంలో కురిసిన వర్షానికి బొట్టు స్వామి ఇంటి పై కప్పుపై భారీ కొబ్బరి చెట్టు కూలి పడటంతో భయందోళనతో ఇంట్లో ఉన్న వారు బయటికి పరుగులు తీశారు. కొబ్బరి చెట్టు కూలడం వల్ల ఇంటి పై కప్పు అయిన రేకులు ధ్వంసం కాగ గోడ కూలి ఇంట్లో సామాగ్రి కూడా ధ్వంసం అయినట్లు తెలిపారు. ఇంటి నుంచి కుటుంబ సభ్యులు కూడా బయటికి పరుగులు తీయడం వల్ల ఎటువంటి ప్రాణపాయం జరుగలేదు. జరిగిన నష్టానికి ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.

Comments

comments