Search
Monday 25 June 2018
  • :
  • :
Latest News

భార్యపై భర్త కత్తితో దాడి

Husband Attacks on his Wife with Knife

నిజామాబాద్ క్రైం: అక్రమ సంబంధానికి అడ్డుగా ఉందన్న ఒకే ఒక కారణంతో ఓ కిరాతక భర్త భార్యను అతిదారుణంగా కత్తితో పొడిచాడు. ఈ సంఘటన నగరంలోని 1వ టౌన్ పోలీస్‌స్టేషన్‌కు కూతవేటు దూరంలో మంగళవారం మధ్యాహ్నం చోటు చేసుకోవడం దురదృష్టకరం. ప్రేమ పేరుతో భార్యను వంచించిన వైనం. దీనికి సంబంధించిన వివరాలు మేరకు ఇలా ఉన్నాయి. నగరంలోని అర్సాపల్లికి చెందిన లత, ఆటోనగర్‌కు చెందిన రాజుతో 8 సంవత్సరాల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకుంది. గడిచిన ఎనిమిదేళ్ల నుండి వీరి కాపురం సజావుగా సాగింది. వీరికి రెండేళ్ల అశ్విత అనే కూతురు ఉంది. అయితే గత కొంత కాలంగా రాజు ఓ యువతితో అక్రమ సంబంధం పెట్టుకుని సహజీవనం సాగిస్తున్నాడు. ఈ విషయం తెలుసుకున్న భార్య లత పలుమార్లు మందలించగా ఆమెపై దాడికి దిగేవాడని, దీంతో లత తన కూతురితో సహా అర్సాపల్లిలోని తల్లిగారింటికి నెలరోజుల క్రితం వెళ్లింది. భార్య పుట్టింటికి వెళ్లడం అదునుగా చూసుకున్న భర్త రాజు తన ప్రియురాలిని ఏకంగా ఇంటికి తీసుకొచ్చి కాపురం చేయడంతో స్థానికులు భర్త చేస్తున్న సహజీవనాన్ని భార్య లతకు వివరించగా ఆమె ఇంటికి వెళ్లి తన భర్తను మందలించి నీపై కేసు పెడతానని జైలుకు పంపిస్తానని బెదిరించింది. భార్య బెదిరింపులతో తన అక్రమ సంబంధానికి ఆటంకం కలుగుతుందని భావించిన భర్త రాజు భార్య అడ్డు తొలగించుకోవాలని కసితో ఆమెను హత్య చేసేందుకు పథకం పన్నాడు. లత 1వ టౌన్ పోలీస్ స్టేషన్ పక్కనే ఉన్న బట్టల దుకాణంలో పనిచేస్తుంది. మంగళవారం మధ్యాహ్నం తలకు ముసుగు ధరించి రాజు తన భార్య పని చేస్తున్న షాపులోకి చొరబడి భార్యపై కత్తితో దాడి చేశాడు. ఈ దాడితో లత చాతి భాగంలో మూడు చోట్ల కత్తి గాయాలయ్యాయి. అప్రమత్తమైన బట్టల షాపు యజమాని పక్కనే ఉన్న 1వ టౌన్ పోలీసులకు సమాచారం అందించగా పోలీసులు అక్కడికి చేరుకుని నిందితుడు రాజును అదుపులోకి తీసుకుని లతను జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితి విషయమించడంతో లతను హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి తరలించినట్లు ఆసుపత్రి వైద్యులు తెలిపారు

Comments

comments