Search
Sunday 24 June 2018
  • :
  • :
Latest News

ఢిల్లీలో ఎమర్జెన్సీ వంటి స్థితి: ఆప్

 IAS officers strike in four months

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో అతవసరస్థితి వంటి పరిస్థితి నెలకొని ఉందని, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కలుగజేసుకోవాలని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) బుధవా రం డిమాండ్ చేసింది. ఢిల్లీ, పంజాబ్ శాసనసభ్యులతోపాటు తాను కోవింద్ అపాయింట్‌మెంట్‌ను కోరినట్లు రాజ్యసభ ఎంపి సంజయ్ సింగ్ చెప్పారు. ‘గత నాలుగు నెలలుగా ఐఎఎస్ అధికారులు సమ్మె చేస్తుండడం వల్ల ఢిల్లీ ప్రభుత్వ పనితీరు పూర్తిగా కుంటుపడిందని ఆయన అన్నా రు. మోడీ ప్రభుత్వం ఆదేశాల ప్రకారమే లెఫ్టినెంట్ గవర్నర్ నడుచుకుంటున్నారని విమర్శించారు. తమ వివిధ డిమాండ్లు నెరవేర్చుకోడానికి, ఒత్తిడి తేడానికి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఆయన కేబినెట్ సహచరులు లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయం వద్ద నిరాహార దీక్షకు కూర్చున్నాక సంజయ్ సింగ్ పై వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రితో మాట్లాడేందుకు మూడు రోజులుగా మూడు నిమిషాలైనా  లెఫ్టినెంట్ గవర్నర్ కేటాయించలేకపోతున్నారన్నారు. తాను సమాజ్‌వాదీ పార్టీ, రాష్ట్రీయ జనతాదళ్, జనతాదళ్(ఎస్), సిపిఎం, సిపిఐ, రాష్ట్రీయ లోక్‌దళ్ పార్టీ నాయకులతో మాట్లాడానని, వారంతా మద్దతిస్తామన్నారని సంజయ్ సింగ్ చెప్పారు.  రాష్ట్రపతి కలుగజేసుకోవాలి. లెఫ్టినెంట్ గవర్నర్, కేంద్రం సమస్య పరిష్కారాన్ని కనుగొనాలని ఆయన కోరారు. ప్రస్తుత సమస్యకు పరిష్కారం కుదరకుంటే ఆప్ పెద్ద ఎత్తున ఉదమిస్తుందని కూడా హెచ్చరించారు.

Comments

comments