Search
Monday 25 June 2018
  • :
  • :
Latest News

మొద్దు నిద్ర విడకుంటే… ముప్పు తప్పదు!

If the stump does not sleep ... the threat is wrong!

13 రహదారులు సమస్యాత్మకం                                                                                                                            నత్తనడకన మరమ్మతు పనులు                                                                                                                                భారీ వర్షాలు కురిస్తే ముంపు తప్పదని ఆందోళన

మన తెలంగాణ/సిటీబ్యూరో: మరోసారి మహానగరంలో లోతట్టు ప్రాం తాలు ముంపునకు గురయ్యే పరిస్థితులు నెలకొన్నాయి. ప్రధాన రహదారులపై వరద నీరు నిల్వడంతో మ రోసారి ట్రాఫిక్ ఇబ్బందులు పునరావృతం కానున్నాయి. వర్షకాల కష్టాలు మరోసారి నగర వాసులకు ఎదురయ్యే పరిస్థితులు నెలకొన్నాయి. వర్షకాలం వచ్చిన భారీ ఎత్తునప్పుడు నీరునిలిచిపోయే ప్రాంతాల్లో చేపట్టిన పనులు ఇంకా పూర్తికాలేదు. ఈ సంవత్సరం మరోసారి ఈ ప్రాంతాలు ముంపునకు గురయ్యే పరిస్థితులు నెలకొన్నాయి. గత సం వత్సరం అక్టోబర్ మాసంలో కురిసిన భారీ వర్షాలకు నగరంలో పలు ప్రాంతాలు నీట మునిగాయి. 13 చోట్ల రోడ్లపై పెద్ద ఎత్తున వరద నీరు నిలవడంలో రోజుల తరబడి రాకపోకలకు ఆటంకాలు ఎదురయ్యాయి. ఈ 13 రోడ్లలో రోజుల తరబడి ట్రాఫిక్ స్తంభించిపోయింది. తీవ్రమైన ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వచ్చింది. ప్రధానంగా బయోడైవర్సిటీ, నాచారం, దీప్తిశ్రీనగర్ తదితరల ప్రాంతాల్లో వారం, పదిరోజుల పాటు రాకపోకలకు అంతరాయం కలిగింది. జిహెచ్‌ఎంసి, ట్రాఫిక్ పోలీస్ శాఖ, నీటి పారుదల శాఖలకు చెందిన అధికారులు తాత్కాలికంగా అప్పట్లో సమస్యను పరిష్కరించారు. దీర్ఘకాలికంగా సమస్యను పరిష్కరించేందుకు ఇంజినీరింగ్ అధికారులు బాధ్యతలు అప్పగించారు. సుమారు రూ.62 కోట్ల అంచనా వ్యయంతో ఈ 13 ప్రాంతాల్లో పనులు చేపట్టాలని నిర్ణయించారు. రహదారులపై నీరు నిల్వకుండా బాక్స్ డ్రెయిన్‌లు, కల్వర్టర్లు నిర్మించాలని ప్రతిపాదనలు రూపొందించారు. అందుకు అనుగుణంగా టెండర్లను ఆహ్వానించారు. 13 చోట్ల పనులు ప్రారంభిస్తే కేవలం మోడల్ హౌస్, అలుగడ్డబావి, ఎల్.బి.నగర్‌లోని వివేకనందనగర్‌లలో మాత్రమే పనులు పూర్తి చేశారు. ఇక మిగిలిన 10 చోట్ల పనులు పురోగతితో ఉన్నాయి. ఈ పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడంతో టెండర్లను పలు పర్యాయాలు ఆహ్వానించాల్సి వచ్చింది. ఈ 13 చోట్ల పనులు చేపట్టేందుకు అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతున్నాయి. ప్రధానంగా సీవరేజీ, తాగునీరు పైప్‌లైన్‌ల తరలింపు జిహెచ్‌ఎంసికి భారంగా మారుతోంది. అంతేకాకుండా విద్యుత్ లైన్లు కూడా అడ్డంకిగా మారుతున్నాయి. అత్యవసర సేవల కిందకు వచ్చే సీవరేజీ, తాగునీటి పైప్‌లైన్‌లు, విద్యుత్ లైన్ల తరలించేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సంబంధిత ప్రభుత్వ శాఖలు జిహెచ్‌ఎంసికి కావల్సిన సహకారం ఇవ్వకపోవడంతో పనులు ముందుకు సాగని పరిస్థితులు నెలకొన్నాయి. ఇక కొన్ని చోట్లనైతే భూసేకరణ కూడా అవసరం అవుతుంది. భూసేకరణ జరపడంతో పాటు, వివిధ సౌకర్యాలకు సంబంధించిన పైప్‌లైన్‌లను తరలిస్తేనే వరదనీరు నిల్వకుండా బాక్స్ డ్రెయిన్‌లు, కల్వర్టర్లను నిర్మించేందుకు వీలవుతుందని అధికారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

నీట మునిగే రహదారులు…
నగరంలో అత్యధికంగా వరద నీరు నిలిచిపోయ్యే రహదారులను గత సంవత్సరం జిహెచ్‌ఎంసి గుర్తించింది. అలుగడ్డబావి, పంజాగుట్ట మోడల్‌హౌజ్, దుర్గం చెరువు, దీప్తిశ్రీనగర్, గచ్చిబౌలి పి.జె.ఆర్ హిల్స్, పాత ముంబాయి హైవే, బయోడైవర్సిటీ, పి.జె.ఆర్ రోడ్ గంగారం, సన్‌శైన్‌వ్యాలీ, సన్‌శైన్ వ్యాలీ నుంచి మూసీనది వరకు, ఎల్.బి.నగర్ మూసీ నది, ఎల్.బి.నగర్ అల్కపురి నాగోల్, ఎల్.బి.నగర్ వివేకనందనగర్ రోడ్లపై పెద్ద ఎత్తున వరదనీరు నిలిచిపోతోంది. ఈ ప్రాంతాల్లో బాక్స్ డ్రెయిన్‌లు, వర్షపునీటి పారుదల కోసం పైప్‌లైన్‌లతో డ్రెయిన్‌లు ఏర్పాటు కోసం చేపట్టిన పనులు ముందుకు సాగడం లేదు. దీంతో ఈ సంవత్సరం కూడా ఈ ప్రాంతాల్లో వరద ముంపుతో ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితులు నెలకొన్నాయి.

Comments

comments