Search
Monday 25 June 2018
  • :
  • :
Latest News

జోరుగా మొరం అక్రమ రవాణా

Illegal  Sand Transport  In Bodhan

మనతెలంగాణ/బోధన్: రుద్రూర్ మండల కేంద్రంలో జోరుగా   మొరం అక్రమ రవాణా జరుగుతున్నప్పటికీ అధికారులు స్పందించడంలేదని పలు విమర్శలు తలెత్తుతున్నాయి. రాత్రి పగలు తేడాలేకుండా కొండాపూర్,సులేమాన్ నగర్, రాయకూర్‌తో పాటు వర్ని మండల కేంద్రంలో సైతం మొరం రవాణా సాగుతోంది. ప్రభుత్వ కార్యాలయం సెలవు ఉన్నప్పుడు పగటిపూటనే మొరం అక్రమంగా రవాణా జరుగుతున్నా అధికారులు స్పందించకపోవడం గమనార్హం. మామూలు రోజులలో రాత్రి 9 గంటలకు నుండి తెల్లవారుజామున 3 గంటల వరకు మొరం రవాణా జరుగుతున్నా మైన్స్, అధికారులు స్పందించకపోవడంలో పలు విమర్శలకు    తావిస్తోంది. మొరం టిప్పర్ 15 వందల నుండి 2500వరకు ధర పలుకుతుండడంతో మొరం మాఫియా చెలరేగిపోయి ఇష్టారాజ్యంగ తవ్వకాలు చేపడుతున్నారు. రెవెన్యూశాఖలో పనిచేస్తున్న గ్రామస్థులు సిబ్బందినుండి మండల స్థాయి అధికారుల వరకు ముడుపులు ముట్టజెప్పుతుండడంతో మొరం మాఫియా సెలవు దినాలలో  సైతం యదేచ్చగ మొరం రవాణాచేస్తున్నట్లు విమర్శలున్నాయి. జిల్లామైన్స్ యంత్రంగారుద్రూర్,మండలాల్లో మొరం రవాణాపై నిర్లక్షంగ వ్యవహరించడంతో నిత్యకృత్యంగ మొరం అక్రమరవాణా సాగుతుంది. దోచుకున్నవాళ్లకు దోచుకున్నంత అన్న చందంగ అటు రెవెన్యూతో పాటు మిగతా యంత్రాంగానికి భారీ స్థాయిలో మామూళ్ళు ముట్టజెపుతున్నట్లు మొరం మాఫియా బహిరంగానే పేర్కొంటున్నారు. కూటమిగ ఏర్పడిన మొరం మాఫియా రక్కి నిర్వహించి వ్యాపార కార్యకళాపాలు సాగిస్తున్నారు. జిల్లా స్థాయి అధికారులు స్పందించి రుద్రూర్,వర్ని మండలాలలో జరుగుతున్న మొరం అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Comments

comments