Search
Wednesday 20 June 2018
  • :
  • :
Latest News

అనుమతుల పేరుతో అక్రమంగా ఇసుక తరలింపు

Illegal Sand Transport In Nalgonda District

వేములపల్లి : అనుమతుల పేరుతో ఇసుకను ఇతర ప్రదేశాలకు తరలిస్తున్న ఐదు ట్రాక్టర్లతో పాటు, అనుమతులు లేకుండా అక్రమ రవాణా చేస్తున్న మరో రెండు ట్రాక్టర్లపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ గుత్తా వెంకట్‌రెడ్డి తెలిపారు. ఎస్‌ఐ వివరాల ప్రకారం…రెండు ట్రాక్టర్లు రావులపేట పాలేరు వాగు నుంచి నిడమనూరు మండల కేంద్రానికి చెందిన వెంకట్‌రెడ్డి అనే వ్యక్తి ఇంటి నిర్మాణానికి ఇసుకను తరలించేందుకు అనుమతి పొందినప్పటికీ అక్కడ ఎలాంటి నిర్మాణం చేపట్టడం లేదన్నారు. అదే విధంగా మరో ట్రాక్టర్ మాడ్గులపల్లి మండలం కుక్కడం గ్రామంలో స్వచ్ఛభారత్ పథకం కింద మరుగుదొడ్డి నిర్మాణానికి ఇసుకను తరలించేందుకు అనుమతి పొందినప్పటికీ అక్కడ ఎలాంటి మరుగుదొడ్డి నిర్మాణం జరగడం లేదని తమ పరిశీలనలో తేలిందన్నారు. మరో ట్రాక్టర్ మిర్యాలగూడలోని బంగారు గడ్డలో మిషన్ భగీరథ ట్యాంకు నిర్మాణం కోసం ఇసుక రవాణా అనుమతి పొందినప్పటికీ అక్కడ ఎలాంటి నిర్మాణ పనులు జరగడం లేదన్నారు. సూర్యాపేట జిల్లాకు చెందిన మరో ట్రాక్టర్ దోసపాడు నుంచి అనుమతులు ఉన్నప్పటికీ మండలంలోని రావులపెంట మూసీ ప్రాంతంలోకి రావడంతో స్వాధీన పర్చుకున్నట్లు తెలిపారు. దీంతో ప్రభుత్వ అనుమతులు పొందినప్పటికీ ఇసుకను ఇతర ప్రదేశాలకు తరలిస్తున్నట్లు తేలడంతో కేసులు నమోదు చేశామన్నారు. రావులపెంట గ్రామానికి చెందిన మరో రెండు ట్రాక్టర్లు ఎలాంటి అనుమతుల్లేకుండా ఇసుక రవాణాకు పాల్పడటంతో వారిపై కేసు నమోదు చేయడం జరిగిందన్నారు.

Comments

comments