Search
Tuesday 19 June 2018
  • :
  • :

శాతావాహనుల కాలంలో పెద్దబొంకూర్ గొప్ప రాజ్యం

In the period of Satavahana, the big Bonkoor is a great kingdom

పలు దేశాలతో ఇక్కడి నుండి వాణిజ్య సంబంధాలు
రెండు వేల సంవత్సరాలు దాటినా చెక్కు చెదరని అవశేషాలు
ఆనాటి ప్రజల సాంకేతిక విజ్ఙానం అద్భుతం
పురావస్తుశాఖ సంచాలకులు విశాలాచ్చి

మనతెలంగాణ/పెద్దపల్లి: క్రీస్తు పూర్వం రెండవ శతాబ్దం నుంచి క్రీస్తుశకం రెండవ శతాబ్దం వరకు నాలుగు వందల సం వత్సరాలు దక్షిణ పథాన్ని పాలించిన శాతవాహనుల కాలంలో పెద్దపల్లి జిల్లా పెద్దబొంకూర్ బలమైన గొప్ప రాజ్యంగా విరాజిల్లిందని తెలంగాణ పురావస్తు శాఖ సంచాలకులు విశాలాచ్చి తెలిపారు. బుధవారం క్షేత్రస్థాయిలో పర్యటించి పెద్దబొంకూర్‌లో జరిగిన తవ్వకాలను పర్యవేక్షించిన అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఫిబ్రవరి 22న మొదలైన తవ్వకాలను 36 టంచన్‌లుగా విభజించి వంద రోజులకు పైగా సాగిన తవ్వకాలలో 920 ప్రాచీన వస్తువులు లభించాయని చెప్పారు.గతంలో పురావస్తు శాఖ ఆధ్వర్యంలో 1968 నుంచి 1973-74 వరకు జరిపిన తవ్వకాలలో ఇటుక కట్టడాలు, ఇటుక బావులు, డ్రైనేజీ వ్యవస్థకు ఉపయోగించిన ఆనవాళ్లు, మౌర్యులు, రోమన్‌ల కాలంనాటి రాగి, బంగారు నాణెములు లభించాయని లభించాయని వివరించారు. ఈ సెషన్లో ఇప్పటి వరకు జరిపిన తవ్వకాలలో మట్టి పూసలు, బంగారు రేకులు,క్రిష్టల్ గాజు,షెల్ బ్రీడ్, ఎముకలతో చేసిన చదరంగపు పాచికలు లభించాయని పేర్కొన్నారు. లాపిస్ లాజులి అనే ప్రాచీన వస్తువు అతి ప్రాముఖ్యాన్ని సంతరించుకుందని ఇది ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతం నుంచి దిగుమతి చేసుకున్నట్టు తెలుస్తోందని అన్నారు. ఇక్కడ లభించిన పూసలు ఇప్పటి వరకు దేశంలో జరిపిన తవ్వకాలలో ఎక్కడా లభించలేవని పేర్కొన్నారు. రోమన్,మౌర్య సామ్రాజ్యాలకు చెందిన రాగి బంగారు నాణేలు, పూసలు లభించడం ద్వారా ఈ ప్రాంత ప్రజలకు ప్రపంచంలోని పలు దే శాలతో వర్తక,వాణిజ్య సంబంధాలను బలపరుస్తున్నాయన్నారు. ఆనాటి అవశేశాలపై చెక్కిన బొమ్మలు, గీతలు ఇప్పటికీ చెక్కు చెదరక పోవడం ఆనాటి ప్రజల సాంకేతిక నైపుణ్యానికి అద్దం పడుతున్నాయని ఆమె పేర్కొన్నారు.
నవంబర్‌లో తిరిగి తవ్వకాలు: గడిచిన ఫిబ్రవరి 22 నుంచి మొదలైన తవ్వకాలను వర్షాకాలం దృష్టా ఈ రోజు నుంచి నవంబర్ వరకు నిలిపి వేస్తున్నట్టు పురావస్తు శాఖ సంచాలకులు విశాలాచ్చి తెలిపారు. తవ్వకాలలో లభించిన 920 ప్రాచీన వస్తువులను వివిధ విభాగాలుగా విభజించి సంబంధిత ప్రాంతాల్లో భద్ర పరచనున్నట్లు తెలిపారు. ఈ టీంలు ఇచ్చే నివేదిక ఆధారంగా తిరిగి నవంబర్‌లో తవ్వకాలను ప్రారంభించనున్నట్టు ఆమె వెల్లడించారు. ఈ కార్యక్రమంలో , మాజీ సంచాలకులు జి.వి. రామకిషన్ రావు, అదనపు సంచాలకులు రాములు నాయక్, కరీంనగర్ ఇన్‌చార్జి ఎడి సిహెచ్ మాధవి తదితరులు పాల్గొన్నారు.

Comments

comments