Search
Sunday 24 June 2018
  • :
  • :
Latest News

యుఎన్ఒ నివేదికను తప్పుపట్టిన భారత్…

un-report

న్యూఢిల్లీ: కశ్మీర్‌పై ఐక్యరాజ్యసమితి ఇచ్చిన నివేదికను భారత్ తీవ్ర స్థాయిలో తప్పుపట్టింది. ఆ నివేదికలో వాస్తవం లేదని, అది వివాదాలకు దారితీసే విధంగా ఉందని, తప్పుడు ధోరణిలో దాన్ని రాశారని భారత్ స్పష్టం చేసింది. భారత్‌లోని జమ్మూకశ్మీర్‌లో, పాకిస్థాన్‌లోని పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుందని ఐక్యరాజ్యసమితికి చెందిన మానవ హక్కుల సంఘం నివేదిక వెల్లడించింది. ఆ సంఘం చీఫ్ జైద్ రాద్ అల్ హుస్సేన్ ఈ నివేదికను అందజేశారు. అయితే రెండు దేశాలు కొన్ని నియమాలను పాటించాలని ఆయన తెలియజేశారు. ముఖ్యంగా కశ్మీర్ ప్రజల ఆత్మాభిమానాన్ని గౌరవించాలని ఆ రిపోర్ట్ ఇండియాను కోరింది. అంతేకాదు 2016 జూలై నుంచి కశ్మీర్‌లో చెలరేగిన అల్లర్లపై విచారణ చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. కమీషన్ ఆఫ్ ఎంక్వైరీ వేయాలని కోరారు. కశ్మీర్ అంశంపై ఐక్యరాజ్యసమితిలో ఇలా మొదటిసారి నివేదికను సమర్పించడం గమనార్హం. కశ్మీర్‌లో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనకు సంబంధించిన సమగ్రమైన దర్యాప్తు చేయాలని జైద్ తన నివేదికలో పేర్కొన్నారు. సిరియా లాంటి సంక్షోభం ఉన్న దేశాల్లో మాత్రమే కమీషన్ ఆఫ్ ఎంక్వైరీ వేస్తారు. కాగా కశ్మీర్ అంశంపై అలాంటి దర్యాప్తు చేపట్టాలని ఐక్యరాజ్యసమితి భారత్ ను కోరడం శోచనీయం. ఇటీవల పదేపదే భారత్, పాకిస్థాన్ సరిహద్దులో కాల్పుల విమరణ ఉల్లంఘన జరుగుతున్నసంగతి తెలిసిందే. హిజ్బుల్ ఉగ్రవాది బుర్హన్ వానీ హత్య అనంతరం రెండు దేశాల ప్రభుత్వాలతో తమ ప్రతినిధులు భేటీ అయినట్టు యుఎన్ తన రిపోర్ట్‌లో తెలిపింది.

Comments

comments