Search
Friday 22 June 2018
  • :
  • :
Latest News

భారత-ఎ జట్టులో ఇషాన్ కిషన్‌కు చోటు

ishan

న్యూఢిల్లీ: ఇటీవలె జరిగిన ఐపిఎల్‌లో అదరగొట్టిన యువ ఆటగాడు ఇషాన్ కిషన్ ఇప్పడు లక్కీ ఛాన్స్ పట్టేశాడు. ఈ యువ ఆటగాడు భారత్-ఎ జట్టుకు ఎంపికయ్యాడు. యో-యో ఫిట్‌నెస్ టెస్టులో విఫలమైన సంజు శాంసన్ స్థానంలో ఇషాన్ కిషన్‌ని భారత-ఎ జట్టుకు ఎంపిక చేసినట్లు సోమవారం సెలక్టర్లు తెలిపారు. జూన్ 17 నుంచి ఇంగ్లండ్‌లో ఓ ముక్కోణపు వన్డే సిరీస్ జరగనుంది. ఈ టోర్నమెంట్‌లో ఇంగ్లండ్ లయన్స్, వెస్టిండీస్-ఎ జట్లతో భారత్-ఎ జట్టు తలపడనుంది.

Comments

comments