Search
Sunday 24 June 2018
  • :
  • :
Latest News

22న ‘జంబలకిడి పంబ’

ravi

ప్రముఖ కమేడియన్ శ్రీనివాసరెడ్డి హీరోగా సిద్ధి ఇద్నాని హీరోయిన్‌గా శివమ్ సెల్యులాయిడ్స్, మెయిన్‌లైన్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘జంబలకిడి పంబ’. జె.బి.మురళీకృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని రవి, జోజో జోస్, శ్రీనివాసరెడ్డి.ఎన్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్‌ను రవితేజ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రవితేజ మాట్లాడుతూ “జంబలకిడి పంబ అనే టైటిల్ వినగానే హిట్ అనే ఫీలింగ్ వచ్చేసింది. థియేట్రికల్ ట్రైలర్ చూస్తే సినిమా తప్పకుండా హిట్ అవుతుందనే నమ్మకం కలిగింది”అని అన్నారు. శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ “మా చిత్రాన్ని ఈనెల 22న విడుదల చేయనున్నాం. ముందు నుంచీ సినిమా పెద్ద హిట్ అవుతుందనే నమ్మకంతోనే పనిచేశాం”అని తెలిపారు. దర్శకుడు జె.బి.మురళీకృష్ణ మాట్లాడుతూ “ఇటీవల విడుదల చేసిన ప్రమోషనల్ సాంగ్‌కు చాలా మంచి స్పందన వచ్చింది. యువతకు నచ్చే అంశాలన్నీ ఈ చిత్రంలో ఉన్నాయి”అని పేర్కొన్నారు. సత్యం రాజేశ్, ధన్‌రాజ్, షకలక శంకర్, హరితేజ, రాజ్యలక్ష్మి, హిమజ, కేదారి శంకర్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరాః సతీష్ ముత్యాల, సంగీతంః గోపీసుందర్, ఆర్ట్‌ః రాజీవ్ నాయర్.

Comments

comments