Search
Sunday 24 June 2018
  • :
  • :
Latest News

టోల్ ప్లాజా సిబ్బందిపై జాట్ నేత దాడి (వీడియో)

jet-leader

ముంబయి : జాట్ నేత సోంబిర్ జస్సియా టోల్‌ప్లాజా ఉద్యోగిపై దాడి చేశాడు. రోహ్‌తక్‌లోని ఓ టోల్‌ప్లాజా వద్దకు సోంబిర్ జస్సియా కారులో వచ్చాడు. అనంతరం కౌంటర్ దగ్గరకు వచ్చి అందులో ఉన్నసిబ్బందిపై దాడికి దిగాడు. సోంబిర్ గత సంవత్సరం కూడా ఇదే విధంగా టోల్‌ప్లాజా ఉద్యోగిపై దాడి చేయడం గమనార్హం. జూన్ 11న చోటుచేసుకున్నఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్ గా మారింది. గతంలో ప్రధాని మోడీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడంతో సోంబిర్ జస్సియాపై దేశద్రోహం కేసు నమోదైన సంగతి తెలిసిందే.

Comments

comments