Search
Sunday 24 June 2018
  • :
  • :
Latest News

25లోపు రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి…

jupally

హైదరాబాద్: ఇచ్చిన గడవులోగా పంచాయతీ ఎన్నికలు పూర్తి చేస్తామని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిజూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. సచివాలయంలో గురువారం మంత్రి జూపల్లి మీడియా సమావేశం నిర్వహించారు. పంచాయతీ ఎన్నికల కోసం ప్రభుత్వ పరంగా అన్నిపనులను పూర్తి చేశామని తెలియజేశారు. పంచాయతీ ఎన్నికల కోసం బిసి జనగణన పూర్తయిందని చెప్పారు. బిసిలకు 34, ఎస్సిలకు 20 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని తెలిపారు. జూన్ 25 లోపు పంచాయతీలు, వార్డుల రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తి చేస్తామన్నారు. స్త్రీలకు లాటరీ ద్వారా సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలు కేటాయిస్తామని సూచించారు. ఎన్నికైన వారికి కొత్త చట్టంపై 3 నెలల పాటు శిక్షణ ఇస్తామని జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు.

Comments

comments