Search
Tuesday 19 June 2018
  • :
  • :

రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

Jupally Krishna rao Speech About Farmers

మనతెలంగాణ/తలకొండపల్లి : రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అహర్నిలు రైతు సంక్షేమం కోసం కృషి చేస్తున్నారని పంచాయతి రాజ్ శాఖ మాత్యుల జూపల్లి కృష్ణారావు అన్నారు. ఆదివారం మండలంలోని రాంపూర్ గ్రామంలో మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డితో కలిసి 6లక్షల రూపాయలతో నిర్మించిన అదనపు పాఠశాల గధిని ప్రారంభించారు. అదే విధంగా 3.5 లక్షల రూపాయతో నిర్మిస్తున్న ప్రహారిగౌడకు భూమిపూజ చేశారు. అనంతరం గట్టుఇప్పలపల్లి గ్రామంలో 3.60 కోట్లతో మంజూరైన బిటి రోడ్డు నిర్మాణ పనులకు, 16 లక్షల రూపాయలతో మంజూరైన గ్రామ పంచాయతి భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ 60 సంవత్సరాల్లో 16 మంది ముఖ్యమంత్రులు చేయలేని పనులను తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత కేసిఆర్ నాలుగేళ్ళ కాలంలోనే రైతుల అభివృద్ది కోసం 24 గంటల నిరంతర ఉచిత కరెంట్, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, కొత్త ప్రాజెక్టులు, రైతు బందు, రైతు భీమా పథకాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా రైతుల ఆత్మగౌరవాన్ని కావాడే విధంగా ప్రవేశపెట్టారని అన్నారు.

రైతులకు ఇన్స్‌రెన్స్ వచ్చే ఆగస్టు నుండి ప్రారంభమవుతుందని అన్నారు. ఆసరా ఫించన్, కళ్యాణలక్ష్మి, షాది ముబారక్‌తో పాటు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని అన్నారు. అదే విధంగా ఈ ప్రాంతానికి చెంది మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి ప్రాంత అభివృద్దికి ఏ నాడు కృషి చేయలేదని, తెలంగాణ ఏర్పాటు కోసం మాట్లాడుమంటే తాను ఒక జాతీయ నాయకుడినని, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశాన్ని మాట్లాడటానికి రాదని చెప్పారని ఆయన దుయ్యబట్టారు. అనంతరం 30 మంది ఆయా పార్టీలకు చెందిన నాయకులు టిఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, కిష్టారెడ్డిలు మాట్లాడారు. కల్వకుర్తి, తలకొండపల్లి ప్రాంతానికి కృష్ణా నీరు వచ్చెలా మంత్రి కృషి చేయాలని వారు కోరారు. సర్పంచ్‌లు జంగమ్మ, మణెమ్మ, ఎంపిటిసిలు వెంకటయ్య, శారధ, పిఎసిఎస్ చైర్మెన్ కేశవరెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు సిఎల్ శ్రీనివాస్ యాదవ్, రైతు మండల సమన్వయ కమిటి దశరథ్ నాయక్, అర్జున్ రావు, ఎంపిడిఓ శ్రీనివాస చార్య, తహశీల్దార్ జ్యోతి, యంఈఓ సర్ధార్ నాయక్, నాయకులు రఘురాములు, కృష్ణ, మనోహర్, హరిమోహన్ రెడ్డి, జంగయ్య, మైసయ్య, రేణ్ రెడ్డి, బోసు వెంకటయ్య, ఢిల్లీ కృష్ణయ్య, అశోక్ గౌడ్, బుచ్చిబాబు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు.

Comments

comments