Search
Saturday 23 June 2018
  • :
  • :
Latest News

అమరులకు జోహార్లు…

Kadiyam Srihari celebrations of State celebration day

మన తెలంగాణ/ వరంగల్ అర్భన్ జిల్లా ప్రతినిధి  : తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ఆదర్శం గా నిలుస్తోందని రాష్ట్ర ఉప ముఖ్యమ్రంతి కడియం శ్రీహరి అన్నారు. శనివారం వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలోని లాల్‌బహదూర్ స్టేడియంలో జరిగిన రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలలో భాగంగా ఉపముఖ్యమ్రంతి కడియం శ్రీహరితో పాటు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శైలేంద్రకుమార్ జోషి మాట్లాడారు. ముందుగా జెండాను ఆవిష్కరించా రు. అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ నిర్మాణంలో ఈ నాలుగేండ్లలో బలమైన అడుగులు వేయగలిగామని అన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు, ప్రణాళికలు మంచి ఫలితాలిచ్చాయని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెట్టిన పథకాలు యావత్తు ప్రపంచానే ఆకర్శించిందని పేర్కొన్నారు. పలు రాష్ట్రాల తెలంగాణను ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలను వివిధ రాష్ట్రాలు అమలు చేసేందుకు సమయత్తం కావడం జరుగుతుందని తెలుపుతోందని అన్నారు. జాతీయ స్థాయిలో తెలంగాణ స్థాయిలో ప్రవేశపెట్టిప పథకాలు దేశంలోనే ఆదర్శంగా లినిచాయనిన్నారు. వ్యవసాయ అభివృద్ధి, భూప్రక్షాళన, రైతు భీమా సాగునీటీ ప్రాజెక్టులు, మిషన్ భగిరథ, మిషన్ కాకతీయ , డబుల్ బెడ్ రూం ఇండ్లు, సాగునీటి ప్రాజెక్టులు, హరితహరం, కళ్యాణలక్ష్మి, టెక్స్‌టైల్ పార్కు, విద్యా వైద్య రంగాలలతో ప్రగతిని వివరిస్తు ప్రసంగించారు. అమర వీరుల కుటుంబాలకు సత్కారం వివిధ రంగాలలో సేవలవలందించిన వారికి ఉత్తమ అవార్డులను అందించారు. వివిధ శాఖల శకటాల ప్రదర్శన జరిగింది. శకటాల ప్రదర్శనలో డిఆర్‌ఓ స్వచ్చ్ భారత్ మిషన్ శకటానికి ప్రధమ బహుమతి అందజేశారు.  ఈ కార్యక్రమంలో ఎంపి పసునూరి దయాకర్, జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ గద్దల పద్మ, రాష్ట్రసివిల్ సప్లయ్ ఛైర్మన్ పెద్ది సుదర్శన్‌రెడ్డి, ఎమ్మెల్యే లు చల్లా ధర్మారెడ్డి, ఆరూరి రమేష్, కలెక్టర్ ఎం హరిత, సిపి రవీందర్, ఆర్‌డిఓ లు మహేందర్‌రెడ్డి, రవి, ఎసిపిలు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Comments

comments