Search
Tuesday 19 June 2018
  • :
  • :

నా కల నెరవేరింది..

kalyanram
నందమూరి కల్యాణ్‌రామ్, తమన్నా జంటగా నటించిన చిత్రం ‘నా నువ్వే’. కల్యాణ్‌రామ్ ఒక్కసారిగా క్లాస్ హీరోగా లుక్ మార్చుకొని చేసిన చిత్రమిది. జయేంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం గురువారం విడుదలకానుంది. ఈ సందర్భంగా హీరో  కల్యాణ్‌రామ్‌తో ఇంటర్వూ విశేషాలు…

నిజంగా నా అదృష్టం…
మొదటిసారి పూర్తి లవ్‌స్టోరీ మూవీలో నటించడం కొత్తగా అనిపించింది. పి.సి.శ్రీరామ్ వంటి గొప్ప వ్యక్తులతో కలిసి పనిచేయడం నిజంగా నా అదృష్టం. ‘గీతాంజలి’ సినిమా చూసి ఆయనలాంటి వారితో పనిచేయగలమా అనుకునేవాడిని. ఇప్పటికి నా కల నెరవేరింది.
తేడా రానిచ్చేవారు కాదు…
దర్శకుడు జయేంద్రది పూర్తిగా భిన్నమైన పద్ధతి. ఆయనకొక విజన్ ఉంది.
ఒక రొమాంటిక్ సినిమాలో ఎలా న టించాలో నాకు ముందుగానే టిప్స్ ఇచ్చేవారు. ఎక్క డా కూడ కొంచెం తేడా రానిచ్చేవారు కాదు. ఈ సినిమాలో డైలాగ్స్ తక్కువ హావభావాలు ఎక్కువగా ఉం టాయి. జయేంద్ర సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు.
ఆ ట్యాగ్స్ అంటే భయం…
నా దృష్టిలో రొమాంటిక్ హీరో, మాస్ హీరో అంటూ ఏం ఉం డదు. నిజానికి ఆ ట్యాగ్స్ అంటే నాకు భయం. ఎప్పుడు ఏ మంచి సినిమా వస్తే ఆ సినిమా చేసుకుంటూ పోవాలి. అది మాస్ సినిమా అయినా సరే రొమాంటిక్ సినిమా అయినా సరే.
ఇగో ఉన్న పాత్ర నాది…
ఈ సినిమాలో నేను పిహెచ్‌డి చేసి ఉద్యోగం కోసం అమెరికా వెళ్లాలనుకునే యువకుడిలా కనిపిస్తాను. కొంచెం ఇగో ఉన్న పాత్ర నాది. ఈ పాత్రలో ఇంకో షేడ్ కూడా ఉంటుంది. దాన్ని సినిమాలోనే చూడాలి.
అంకితభావంతో పనిచేస్తుంది…
తమన్నా చాలా ప్రొఫెషనల్. సమయానికి సెట్‌కు వచ్చేస్తుంది. చాలా అంకింతభావంతో పనిచేస్తుంది. ఆమెతో పనిచేయడం ఎంతో బాగుంది. సినిమాలో తమన్నా అద్భుతంగా నటించింది.
డిఫరెంట్ మూవీగా…
కిరణ్, విజయ్‌లు మంచి నిర్మాతలు. అలాగే మరొక నిర్మాత మహేష్ కోనేరు కూడా. అతని వల్లే ఈ ప్రాజెక్ట్ నా దగ్గరకొచ్చింది. నా కెరీర్‌లో ఈ చిత్రం డిఫరెంట్ మూవీగా నిలుస్తుంది.
వచ్చే ఏడాది ఎన్టీఆర్‌తో…
ఎన్టీఆర్‌తో సినిమా చేసే ప్లాన్స్ ఉన్నాయి. వచ్చే ఏడాది ఈ సినిమా చేసే అవకాశాలున్నాయి. ఇక గుహన్‌తో చేస్తున్న సినిమా ఈనెల 18కి దాదాపు 50 శాతం పూర్తవుతుంది. జూలై చివరికి ఈ సినిమా పూర్తయ్యే అవకాశాలున్నాయి. విరించి వర్మతో ఒక ప్రాజెక్ట్ ఉంది. ఇది కూడా డిఫరెంట్ జోనర్ సినిమా. దాని కోసం కొత్త గెటప్ ట్రై చేయాలి.

Comments

comments