Search
Sunday 24 June 2018
  • :
  • :
Latest News

కొడుకును గొడ్డలితో నరికి చంపిన తండ్రి

Kanna son is Father killed by ax
జగిత్యాలరూరల్: కన్న తండ్రే కొడుకును గొడ్డలితో నరికి చంపిన సంఘటన జగిత్యాల జిల్లా పోరండ్ల గ్రామంలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… పోరండ్ల గ్రామానికి చెందిన బోదనపు రవి(30) మద్యానికి బానిసై కుటుంబ సభ్యులను నిత్యం వేధిస్తుండేవాడు. గురువారం రాత్రి చిత్తుగా మద్యం సేవించిన రవి తల్లిదండ్రులతో గొడవ పడ్డాడు. చంపుతానని బెదిరించాడు. నిత్యం కొడుకు పెట్టే వేధింపులు భరించలేక కన్న తండ్రి రాజయ్య గొడ్డలితో రవిపై దాడి చేశాడు. దాంతో తీవ్ర గాయాల పాలైన రవి అక్కడికక్కడే మృతి చెందాడు. జగిత్యాల రూరల్ ఎస్‌ఐ కిరణ్‌కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

Comments

comments