Search
Wednesday 20 June 2018
  • :
  • :
Latest News

జిపిఎస్ గర్ల్ కారెన్

karen-Nakabgensen

మన స్మార్ట్‌ఫోన్లలో ఎన్నో యాప్స్ వాడుతాం. అందులో గూగుల్ మ్యాప్స్ యాప్ కూడా ఒకటి. మనకు తెలియని ఏదైనా ప్రాంతానికి ఒకప్పుడు వెళ్లాలంటే దారిలో కనబడిన ప్రతి ఒక్కరిని అడ్రస్ అడుగుతూ వెళ్లాల్సి వచ్చేది. కానీ ఇప్పుడలా కాదు. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు అందులో గూగుల్ మ్యాప్స్‌తో ఎంత దూరమైనా వెళ్లవచ్చు. కొత్త ప్రదేశానికి వెళ్లినా అక్కడ ఏదైనా అడ్రస్‌ను కావాలంటే దీని ద్వారా సులభంగా తెలుసుకోవచ్చు. లేదంటే ఫ్రెండ్స్ షేర్ చేసిన మ్యాప్ లొకేషన్‌కు కూడా నేరుగా మనం చేరుకోవాల్సిన గమ్యానికి చేరుకోవచ్చు.

గూగుల్ మ్యాప్స్‌లో మనకు లభిస్తున్న ముఖ్యమైన ఫీచర్ నావిగేషన్.  అందులో మనం ఏదైనా మార్గంలో వెళ్లాలనుకుంటే నావిగేషన్ ఆన్ చేస్తే చాలు. మనకు అందులోంచి ఒక లేడీ వాయిస్ ఓవర్ వినిపిస్తుంది. ఫలానా మార్గంలో వెళ్లమని, ఫలానా స్టాప్ వద్ద మలుపు తిరగమని, ఆగమని చెబుతూ సూచనలిస్తుంది. ఆ లేడీ వాయిస్ ఎవరిదో తెలుసా…? ఆస్ట్రేలియాకు చెందిన ఓ మహిళది. పేరు కారెన్ జాకబ్‌సన్. కారెన్‌ది ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్. ప్రస్తుతం ఈమె న్యూయార్క్‌లో ఉంటోంది. కారెన్ మంచి సింగరే కాదు, మోటివేషన్ కలిగించే ప్రసంగాలను ఇస్తుంటుంది.

జనాలను చక్కగా ఎంటర్‌టైన్ చేస్తుంది. కారెన్ వాయిస్ చక్కగా సెట్ అవుతుందని తెలుసుకున్న గూగుల్ సంస్థ ఆమె వాయిస్‌ను గూగుల్ మ్యాప్స్‌లోని నావిగేషన్‌లో ఏర్పాటు చేసింది.  కారెన్ తన వాయిస్‌ను గూగుల్ మ్యాప్స్‌కు ఇవ్వడంతో ఇప్పుడందరూ ఆమె పేరును జీపీఎస్ గర్ల్‌గా మార్చారు. జీపీఎస్ గర్ల్ అంటే ఆస్ట్రేలియాలోనే కాదు, అటు అమెరికాలోనూ అందరికీ కారెన్ జాకబ్‌సన్ గుర్తుకు వస్తుంది. కేవలం తన వాయిస్‌తో ప్రపంచంలోని ప్రతి ఒక్కరి స్మార్ట్‌ఫోన్‌లో నిలిచిపోయేలా చేసుకుంది.

Comments

comments