Search
Saturday 23 June 2018
  • :
  • :
Latest News

యంగెస్ట్ ఇంజినీర్

తనకున్న జ్ఞాపకశక్తి, తెలివితేటలతో తెలంగాణ యంగెస్ట్ ఇంజినీర్‌గా రికార్డుల్లోకి ఎక్కి అందరి ప్రశంసలను అందుకుంటోంది కాశీభట్ట సంహిత. తనకున్న మేధాశక్తితో 16 ఏళ్లకే ఇంజినీరింగ్ పూర్తి చేసి రికార్డు సృష్టించింది. తల్లిదండ్రుల సహకారంతో సంహిత 3 సంవత్సరాల వయసులోనే ప్రపంచ దేశాలు, వాటి రాజధానుల పేర్లను చూడకుండా గడగడా చెప్పేసేది. మూడేళ్ల వయసులోనే 4 తరగతి పూర్తి చేసింది. పదేళ్లకు 10 తరగతి పాసై అందరినీ ఆశ్చర్యపరిచింది.

youngest-engineer

గుడ్ స్మార్టియన్స్ హై స్కూల్‌లో చదువుకున్న సంహిత పదో తరగతిలో 8.8 జిపిఎ సాధించింది. 2014లో నలంద జూనియర్ కాలేజీలో ఇంటర్ పూర్తి చేసింది. ఇంటర్ లో 89 శాతం మార్కులు సాధించి అందరి ప్రశంసలను పొందింది. తెలంగాణ ప్రభుత్వ అనుమతితో 2014లో ఎంసెట్‌లో మంచి ర్యాంకు సాధించి.. చైతన్యభారతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (సిబిఐటి)లో ఇఇఇ కోర్సులో చేరింది. ఇంజినీరింగ్‌లో కూడా ఆమె మంచి మార్కులు సాధించింది. అంతే కాకుండా క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో ఉద్యోగం సాధించి మంచి భవితకు పునాదులు వేసుకుంది.
ఈ సందర్భంగా సంహిత మాట్లాడుతూ కాన్సెప్ట్ మెథడ్‌లో చదవడం వల్లే ఈ విజయం సాధ్యమైనట్లు చెబుతోంది. బట్టీ చదువులు చదవకుండా సబ్జెక్ట్‌ను అర్థం చేసుకుని చదవుకోవాలని విద్యార్థులకు సూచించింది. గంటల తరబడి తానెప్పుడూ పుస్తకాలతో కుస్తీ పట్టలేదని, సబ్జెక్ట్స్ ను కష్టపడి కాకుండా ఇష్టపడి చదివానని సంహిత అంటోంది. కూతురు అతి చిన్న వయసులోనే ఇంజినీరింగ్ పూర్తి చేయడంపై ఆమె పేరెంట్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Comments

comments