Search
Monday 25 June 2018
  • :
  • :
Latest News

సుందర పుణ్యక్షేత్రాలుగా యాదాద్రి.. భద్రాద్రి

KCR Government Develop to Yadadri and Bhadradri

ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలైన యాదగిరిగుట్ట, భద్రాచలంను సమగ్ర ఆధ్యాత్మిక కేంద్రాలుగా రాష్ట్ర ప్రభుత్వం తీర్చిదిద్దుతోంది. యాదాద్రికి ప్రతి ఏటా బడ్జెట్‌లో రూ. 100 కోట్లకు తక్కువ కాకుండా కేటాయిస్తోంది. ఈ ఏడాది బడ్జెట్‌లో టెంపుల్ అథారిటీకి ప్రభుత్వం రూ. 250 కోట్లు కేటాయించింది. దాదాపు 13 ఎకరాల విస్తీర్ణంలో రాతితో చేపట్టిన ఆలయ నిర్మాణ పనులు, ఆలయ గోపురాలు, మండపాలు, ప్రాకారాల పనులు వేగంగా జరుగుతున్నాయి. గతంలో ప్రధానాలయం అర ఎకరం విస్తీర్ణంలో ఉండగా, ప్రస్తుతం మూడు ఎకరాలకు పెరిగింది. ప్రధాన ఆలయం నిర్మాణ పనులు దాదాపు తుదిదశకు చేరుకున్నారు.

KCR Government Develop to Yadadri and Bhadradri

భద్రాచలం ఆలయాన్ని దేశంలోనే ఒక అద్భుత పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం నిర్ణయించింది. దేవాలయానికి ఉత్తరం, పడమర దిక్కున ఉన్న స్థలాలతో కలిపి 30 ఎకరాల విస్తీర్ణంలో దేవాలయాన్ని అభివృద్ధి చేసేలా ప్రణాళికలు సిద్ధమయ్యాయి. మూలవిరాట్టు కొలువై ఉన్న గర్భగుడి, చారిత్రాత్మక, పౌరాణిక, ఆధ్యాత్మిక ప్రాధాన్యం గల కట్టడాలకు ఆటంకం కలగకుండా నిర్మాణాలను చేపడుతున్నారు. ఈ ఏడాది బడ్జెట్‌లో భద్రాద్రికి కూడా రూ. 100 కోట్లు కేటాయించింది.

కొమురవెల్లి మల్లన్న.. నాగర్జునసాగర్ బౌధ్ద క్షేత్రం

కొమురవెల్లి దేవస్థానానికి ప్రభుత్వం 166 ఎకరాలు కేటాయించింది. అక్కటే కాటేజిలు, ఇతర అభివృద్ధి పనులకు రూ. 10 కోట్లు మంజూరు చేశారు. బుద్ధగయ తరహాలో నాగర్జునసాగర్ ప్రాంతాన్ని ప్రపంచస్థాయి బౌద్ధ క్షేత్రంగా మార్చాలని నిర్ణయించింది. ఇందుకోసం ప్రత్యేక అథారిటీని కూడా ఏర్పాటుచేసింది.

అర్చకులకు వేతనాలు

దేవాలయాల్లో పనిచేస్తున్న అర్చకులకు గత ఏడాది నవంబర్ నుంచి ప్రభుత్వ ఉద్యోగాల మాదిరే పే స్కేల్‌ను ప్రభుత్వం అమలుచేస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలోని 1805 దేవాలయాల్లో అమలవుతున్న దూపదీప నైవేధ్యం పథకాన్ని మరో 3 వేల దేవాలయాలకు వర్తింపజేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు.

 బి.అరుణ్ కుమార్

Comments

comments