Search
Sunday 24 June 2018
  • :
  • :
Latest News

కెసిఆర్ పై కోమటిరెడ్డి గరం…

komatreddy

హైదరాబాద్: టిఆర్ఎస్ ప్రభుత్వం తమపై కక్ష సాధించడానికే తమ శాసనసభ సభ్యత్వాలను రద్దు చేసిందని కాంగ్రెస్ ఎంఎల్ఎ కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు. తమ సభ్యత్వాలను తిరిగి పునరుద్ధరించాలని హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుతో మఖ్యమంత్రి కెసిఆర్ చెంప వాచిందన్నారు. ఆ తరువాత ఫుల్ బెంచ్ ఇచ్చిన తీర్పుతో ముఖం అంతా వాచిపోయిందని వ్యాగ్యస్రాలు సందించారు. తమ సభ్యత్వాలను ఇప్పటికైనా పునరుద్ధరించకపోతే కోర్టు తీర్పును ఉల్లఘించినందుకు కెసిఆర్ ను, సంబంధింత ప్రభుత్వం అధికారులను కోర్టుకు లాగుతామని ఆయన హెచ్చరించారు. కెసిఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మిషన్ భగీరథ పనుల్లోని కుంభకోణాన్ని అసెంబ్లీలో ప్రశ్నించినందుకే తన సభ్యత్వాన్ని రద్దు చేయించారని ఆయన నిప్పులు చెరిగారు. అన్యాయంగా తన అనుచరుడైన శ్రీనును హత్య చేయించారని ఆరోపించారు. తనకు గన్ మెన్లను సైతం తొలగించారని ఆవేదన వ్యకం చేశారు. తమ నియోజకవర్గానికి నిధులు విడుదల కాకుండా అడ్డుపడుతున్నారని ఫైర్ అయ్యారు.

Comments

comments