Search
Monday 25 June 2018
  • :
  • :
Latest News

మొక్కల వివాదం సర్పంచ్ ప్రాణం తీసింది..!

death

పంజాబ్: మొక్కలు నాటే విషయంలో మొదలైన గొడవ ఓ సర్పంచ్ ప్రాణం తీసింది. ఈ ఘటన పంజాబ్ లోని లంబ్రా గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం… గ్రామ సర్పంచ్ అయిన దేవిందర్ సింగ్(42) తన ఇంటికి సమీపంలో కొన్ని మొక్కలు నాటుతున్నాడు. అదే సమయంలో మన్మోహన్ సింగ్ అనే వ్యక్తి అక్కడికి వచ్చి దేవిందర్ తో వాగ్వివాదానికి దిగాడు. గొడవ కాస్త ముదరడంతో కొపోద్రిక్తుడైన మన్మోహన్ సింగ్ సర్పంచ్ పై కర్రతో దాడి చేశాడు. ఈ సంఘటనలో దేవిందర్ తీవ్రంగా గాయపడ్డాడు. తక్షణమే అతన్ని స్థానిక దవాఖానకు తరలించారు. కాగా చికిత్స పొందుతూ సర్పంచ్ దేవిందర్ సింగ్ మృతిచెందాడు. ఈ కేసులో మన్నోహన్ సింగ్ పై ఐపిసి సెక్షన్ 302 ప్రకారం కేసు నమోదు చేసి, పరారీలో ఉన్న నిందితుని కోసం గాలింపు చర్యలు చేపట్టామని ఎస్ హెచ్ వొ యద్విందర్ సింగ్ పేర్కొన్నారు.

Comments

comments