Search
Tuesday 19 June 2018
  • :
  • :

పేదల గుడారాలు

 Land distributed by the government to farmers

రైతులకు ప్రభుత్వం పంపిణీ చేసిన భూమిని అక్రమ మార్గా ల ద్వారా కొనుగోలు చేసి ఆ భూములను వెంచర్లుగా చేయ డానికి ప్రయత్నిస్తు న్న పెద్దల కబ్జా భూమిని పేదలు ఆక్ర మించి గుడా రాలు వేసుకున్నారు. గురు వారం రాత్రి 9గంటలకు సుమారు 210 మంది ఇండ్ల స్థలాలు లేని నిరుపేదలు గుంజలు పాతి గుడారాలు వేశారు. భూ అక్రమార్కులు ముందస్తుగాఈ భూముల్లో 2013లో పద్మశాలి భవన్ ఏర్పాటుకు శంకుస్థాపన చేయ డానికి ఎమ్మెల్యే ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరు కాగా 243 సర్వే నెంబర్ భూమిలో కాకుం డా 240 సర్వే నెంబర్ భూమి లో శంకుస్థాపన చేయించా రని స్థానికులు ఆరోపిస్తు న్నారు. రాత్రి సమయంలో భారీగా తరలి వచ్చిన ప్రజలు ఈ భూములను ఆక్రమించి తాత్కాలిక టెంట్లు వేసుకున్నారు. దీంతో స్థానిక పోలీసులు, తాహసీల్ధార్ రావడంతో ప్రజలు వాగ్వివాదానికి దిగారు. అధికారులు నచ్చజె ప్పినా వినకపోవడంతో చేసేదేమిలేక అధికారులు వెనుదిరిగారు.

మన తెలంగాణ/ నల్లగొండ ప్రతినిధి: సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం కేంద్రంలో 243,244 సర్వే నెంబర్లలలో సుమారు 6 ఎకరాల ప్రభుత్వ భూమి వుంది. దీనిలో భూమిలేని నిరుపేదలకు గతంలో ప్రభుత్వం కొంత మేరకు భూపంపిణీ చేసి లావణ్య పట్టాలను ఇచ్చింది. ఈ భూమి ఆర్‌అండ్‌బి రోడ్డుకు ఆనుకొని వుండటంతో ఎకరం కోటి ఇరవై లక్షల వరకు ధర పలుకుతోంది. మండలానికి చెందిన వివిధ పార్టీల నేతల కన్ను ఈ విలువైన భూమిపై పడింది. ఏదో విధంగా భూమిని స్వంతం చేసుకొని ఫ్లాట్‌ల బిజినెస్ చేస్తే కోట్లు కొల్లగొట్టవచ్చునని ఆశించారు. లావణ్య పట్టాలు కలిగిన భూములను కొనకూడదని తెలిసి నప్పటికి రాజకీయాన్ని అడ్డుపెట్టుకొని రైతులను మభ్యపెట్టి అతి తక్కువ ధర కొనుగోలు చేశారు. పక్కనున్న మరికొంత ప్రభుత్వ భూమిని కలుపుకొని ఫ్లాట్ల ఏర్పాటుకు యత్నిస్తు న్నారు. భూ అక్రమార్కులు ముందస్తుగాఈ భూముల్లో 2013లో పద్మశాలి భవన్ ఏర్పాటుకు శంకుస్థాపన చేయ డానికి ఎమ్మెల్యే ఉత్తమ్ కుమారెడ్డి హజరుకాగా 243 సర్వే నెంబర్ భూమిలో కాకుండా 240 సర్వే నెంబర్ భూమిలో శంకుస్థాపన చేయించారని స్థానికులు ఆరోపిస్తున్నారు. కాగా గత రెండు నెలులుగా నేరేడుచర్లలో ఇండ్ల స్థలాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో నిరుపేదలు ధర్నా చేస్తున్నారు. ప్రభుత్వ అధికారులకు పలుమార్లు వినతి పత్రాలు ఇచ్చిన నేపధ్యంలో గురువారం 243,244, 250 సర్వే నెంబర్ల భూమిని అధికారులు కొలతలు వేశారు. రాత్రి సమయంలో బారీగా తరలి వచ్చిన ప్రజలు ఈ భూములను ఆక్రమించి తాత్కాలిక టెంట్లు వేసుకున్నారు. దీంతో స్థానిక పోలీసులు, తాహసీల్ధార్ రావడంతో ప్రజలు వాగ్వివాదానికి దిగారు. అధికారులు నచ్చజెప్పినా వినకపోవడంతో చేసేదేమిలేక వెనుదిరిగారు.

రెండు నెలలుగా పోరాడుతున్నాం: మాలవి
ఇండ్ల స్థలాల కోసం రెండు నెలలుగా ధర్నా చేస్తున్నాం. మాకు సెంటు భూమి కూడా లేదు. ప్రభుత్వ భూమిని పెద్దోళ్ళు అనుభవిస్తున్నా అధికారులు పట్టించుకోలేదు. పిల్లా పాపలతో రోడ్ల మీద ఎట్లా బతకాలి. ప్రభుత్వ భూమిలో గుడారాలు వేసుకున్నాం.
అధికారులు తీవ్ర నిర్లక్షం చేశారు: జ్యోతి
ఇండ్ల స్థలాలకోసం కలెక్టర్‌ను, ఆర్డీఓ, తహసీ ల్దార్ తదితర అధికారుల చుట్టూ తిరిగినా నిర్లక్ష ధోరణి ప్రదర్శించారు. పలుమార్లు కార్యాలయాలు చుట్టూ తిరగ్గా జూన్ 5 తేదిన సెటిల్ చేస్తామని ఆర్డీఓ చెప్పారు కాని రాలేదు. ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేసుకున్నాం. ఎవరు వచ్చినా ఇక్కడి నుంచి కదిలేది లేదు.

Comments

comments