Search
Saturday 23 June 2018
  • :
  • :
Latest News

ఔటర్‌లో ఎల్ఇడి కాంతులు

Led lights in Outer

136 కి.మీ.లు… రూ. 107 కోట్లు
టెండర్ల ప్రక్రియలో నిమగ్నమైన హెచ్‌ఎండిఎ
పోటీలో శబరి, కెఎంవి, బజాజ్ సంస్థలు

మన తెలంగాణ/సిటీబ్యూరో: త్వరలోనే ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్‌ఆర్) ఎల్‌ఇడి విద్యుత్ కాంతుల్లో వెలిగిపోనున్నది. ఔటర్‌లో  అందులో భాగంగానే టెం డర్లను పిలిచి తెరవడం జరిగింది. ఈ దీపాలను ఏర్పాటు చేసేందుకు శబరి ఎలక్ట్రికల్స్, కెఎంవి ప్రాజెక్ట్, బజాజ్ ఎలక్ట్రికల్స్ అనే మూడు సంస్థలు టెండర్లలో పాల్గొన్నాయి. ఈ సంస్థల దరఖాస్తులను హెచ్‌ఎండిఎ టెక్నికల్ కమిటీ సాంకేతికపరమైన అంశాలను పరిశీలిస్తున్నది. అ నంతరం ఆర్థిక సా మర్థం వంటి విషయాలను పరిశీలించి టెండర్‌ను ఖరారు చేయనున్నట్టు అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ ప్రక్రియను ఈ నెలాఖ రు వరకు పూర్తిచేసి జులై నెలలో పనులు ప్రారంభించేలా అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.

136 కి.మీ.లు… రూ.107 కోట్లు…
ఓఆర్‌ఆర్ మొత్తం పొడవు 158 కి.మీ.లు. 18 ఇంటర్ చేంజెస్‌లు. రింగ్ రోడ్‌కు ఇరువైపులా సర్వీసు రోడ్లు. వీటికి పూర్తిగా ఎల్‌ఇడి కాంతులను అందించాలని కమిషనర్ గత ఏడాది క్రితమే నిర్ణయించారు. అందులో భాగంగానే ప్రయోగాత్మకంగా గచ్చిబౌలి నుంచి శంషాబాద్ వరకు 25 కి.మీ.లుగా రూ. 32 కోట్లు వెచ్చించి ఎల్‌ఇడి దీపాలను ఏర్పాటు చేయడం జరిగింది. వీటితో అధికంగా కాంతి రావడంతో పాటు ఎక్కువకాలం మన్నికగా ఉండటాన్ని గ్రహించిన కమిషనర్ ఇప్పుడు మిగిలిన ఓఆర్‌ఆర్ మొత్తం పొడవు 136 కి.మీ.లుగా ఎల్‌ఇడిలను అమర్చాలని నిర్ణయించారు. అందుకు అంచనా వ్యయం రూ. 107 కోట్లుగా ఖరారు చేశారు. రింగ్‌రోడ్‌లోని ప్రధాన క్యారేజ్‌వే, ఇంటర్‌చేంజెస్, సర్వీసు రోడ్డులోనూ వీటిని అమర్చి ఔటర్‌ను మరింత ప్రకాశవంతంగా చేయనున్నారు. వీటి వెలుగుతో రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయని, కాంతివంతంగానూ దర్శనమిస్తుందని ఆయన భావిస్తున్నారు.

ఔటర్ చుట్టూర అభివృద్ధి…
ఔటర్ రింగ్ రోడ్ వెంట పచ్చని వనాలు రానున్నాయి. అందుకు అర్బన్‌ఫారెస్ట్రీ ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది. ఔటర్‌కు చేరువలో భారీ ట్రక్‌పార్కులు, బస్సు ప్రయాణ ప్రాంగణాలు, శాటిలైట్ టౌన్‌షిప్స్, ట్రామా కేంద్రాలు రానున్నాయి. ఈపాటికే అథారిటీ రెండు భారీ ట్రక్‌పార్కులను నిర్మిస్తున్నది. మరో నాలుగు లాజిస్టిక్ హబ్‌లను ఏర్పాటుచేసేందుకు రంగం సిద్ధ్దం చేసింది. ఆరు బస్సుటెర్మినల్స్‌ను నిర్మించాలని ప్రణాళికలకు సన్నాహాలు చేస్తున్నది.

Comments

comments