Search
Sunday 24 June 2018
  • :
  • :
Latest News

నాగవైష్ణవి హత్య కేసులో నిందితులకు జీవితఖైదు

NagaVaishnavi

అమరావతి: విజయవాడలో నాగవైష్టవి హత్య కేసు తుది తీర్పు ఎట్టకేలకు ఎనిమిదేళ్ల తరువాత గురువారం వెలువడింది. నాగవైష్ణవి హత్య కేసులో ముగ్గురు నిందితులకు మహిళ సెషన్స్ కోర్టు జీవితఖైదు శిక్ష విధించింది. దోషులు మోర్ల శ్రీనివాసరావు, యంపరాల జగదీష్, వెంకట్రావుకు జీవితఖైదు విధించింది. ఆస్తి తగాదాల నేపథ్యంలో  2010 జనవరి 30న చిన్నారి వైష్ణవిని కిడ్నాప్‌ చేసి చంపేశారు. తర్వాత ఆమె శవాన్ని ఇనుము కరిగించే బాయిలర్‌లో వేసి బూడిద చేసిన విషయం తెలిసింది. చిన్నారి మరణం తట్టుకోలేక తండ్రి ప్రభాకర్ గుండెపోటుతో మృతి చెందాడు.

Comments

comments