Search
Friday 22 June 2018
  • :
  • :
Latest News

అంగారక గ్రహంపై ప్రాణికోటి?

int

తాజా సాక్షాధారాలను కనుగొన్న  ‘నాసా’ క్యూరియాసిటీ

వాషింగ్టన్: అంగారక గ్రహంపై జీవ రాశి ఉండి ఉండవచ్చనే దానికి తాజాగా మరికొన్ని ఆధారా లు లభించాయి. దీంతో ఈ గ్రహంపై గతంలోనే కాక ఇప్పుడు కూడా ప్రాణికోటి ఉందనే వాదనల కు మరింత బలం చేకూరినట్లయింది. అమెరికా అంతరిక్ష పరిశోధనా కేంద్రం నాసా అంగారక గ్ర హంపై పరిశోధనల కోసం పంపిన క్యూరియాసిటీ రోవర్ అంగారక గ్రహం ఉపరితలంపై ఓ ప్రాచీన సరస్సు ఒడ్డున మూడు వందల కోట్ల సంవత్సరాల నాటి బలమైన సేంద్రీయ అణువుల బ్లాక్‌లను, వా తారణంలో మిథేన్ వాయువుల స్థాయిలలో తేడాలను కనుగొనిందని, దీన్ని బట్టి ఈ గ్రహంపై ప్రాణి కోటి ఉండి ఉండే అవకాశాలున్నాయని అర్థమవుతోందని సైన్స్ జర్నల్‌లో ప్రచురించిన ఒక వ్యాసంలో తెలిపారు. సేంద్రీయ అణువుల్లో కర్బ నం, ఉదజని వాయువులతో పాటుగా ఆక్సిజన్, నైట్రోజన్ వాయువులు, ఇతర పదార్థాలు ఉంటా యి. సాధారణంగా జీవ కోటితో ముడిపడి ఉండే ఈ సేంద్రీయ అణువులు జీవ సంబంధేతర ప్రక్రియ ల ద్వారా కూడా ఏర్పడ వచ్చు. అందువల్ల ఇవి జీవ కోటికి సంకేతాలుగా చెప్పడానికి వీల్లేదు. అయితే క్యూరియాసిటీ కనుగొన్న ఈ అంశాలు భవిష్యత్తులో అంగారక గ్రహ ఉపరితలంపై జరపబోయే పరిశోధనలకు తోద్పడతాయని నాసా ఒక ప్రకటనలో తెలిపింది.
అంగారక గ్రహంపై జీవకోటి కోసం పరిశోధనలను కొనసాగించాలని తాజాగా కనుగొన్న ఈ విషయాలు చెప్తున్నాయని వాషింగ్టన్‌లోని నాసా ప్రధాన కార్యాలయంలో సైన్స్ మిషన్ డైరెక్టరేట్ అసోసియేట్ అడ్మినిస్ట్రేటర్ థామస్ జుర్బుచెన్ అన్నారు. అయితే క్యూరియాసిటీ ఈ సేంద్రీయ అణువులు ఎలా ఏర్పడ్డాయో మాత్రం నిర్ధారించలేదనినాసాకు చెందిన గోడ్డార్డ్ స్పేస్ ఫ్లైట్ సెంటర్‌కు చెందిన జెన్ ఈగెన్‌బ్రోడ్ చెప్పారు.అంగారక గ్రహం ప్రస్తుతం జీవ రాశి ఉం డడానికి వీలు లేనంత వేడిగా ఉన్నప్పటికీ అనేక వందల కోట్ల సంవత్సరాల క్రితం ఈ గ్రహంపైన కూడా ప్రాణికోటికి జీవనాధారమైన ద్రవ జలం ఉండేదనే దానికి స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని నాసా తెలిపింది.
వందల కోట్ల సంవత్సరాల క్రితం గాలే బిలం లోపల ఉండే ఒక నీటి సరస్సులో ప్రాణి కోటికి అవసరమైన అన్ని పదార్థాలు ఉండేవని క్యూరియాసిటీ సేకరించిన డేటాను బట్టి స్పష్టమవుతోందని కూడా నాసా తెలిపింది.

Comments

comments