Search
Sunday 24 June 2018
  • :
  • :
Latest News

విద్యుత్ షాక్ తో జూనియర్ లైన్ మెన్ దుర్మరణం

Lineman Dies Dues To Electric Shock While Repairing

విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ పైన మరమత్తులు చేస్తుండగా ప్రమాదవశాత్తు షాక్‌కు గురై జూ లైన్ మెన్ మృతి చెందాడు. ఈ సంఘటన మండల పరిధిలోని ఇస్నాపూర్ శివారులో శనివారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. సంగారెడ్డి మండలం ఇస్మాయిల్ ఖాన్ పేటకు చెందిన రామకృష్ణ (35) పటాన్ చెరు మండలం ఇస్నాపూర్ లో నివాసం ఉంటు స్థానికంగా విద్యుత్ శాఖలో జూనియర్ లైన్ మెన్ గా పనిచేస్తున్నాడు. వృత్తిలో భాగంగా శనివారం ఉదయం ఇస్నాపూర్ శివారులో గల విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ వద్ద విధులు నిర్వహిస్తుండగా విద్యుత్ షాక్ తగిలి క్రింద పడడంతో తీవ్ర గాయాలైయ్యాయి. తోటి ఉద్యోగి గోరెమియ వెంటనె గాయాలైన రామకృష్ణను వెంటనే స్థానికంగా ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ డాక్టర్లు హైదరాబాద్కు తరలించమని సూచించగా వెంటనే సోమాజి గూడ యశోద ఆసుపత్రికి తరిలించారు.ఆసుపత్రి డాక్టర్లు అప్పటికే మృతి చెందినట్టు వెల్లడించారు. ఈ మేరకు భార్య రూపకళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

Comments

comments