Search
Tuesday 19 June 2018
  • :
  • :

కళలను కాపాడుకోవాలి: కలెక్టర్

collectar-image

మన తెలంగాణ / సిరిసిల్ల : తెలంగాణ కళారూపాలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని కలెక్టర్ కృష్ణభాస్కర్ అన్నారు. అనాది కాలం నుండి తెలంగాణ రాష్ట్రంలో పలు రకాల కళారూపాలున్నాయని అవి ప్రస్తుతం కాలగర్భంలో కలిసి పోయే పరిస్థితులు రానున్న నేపథ్యంలో వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, భాషా, కళారూపాల పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి అనేక రకాలుగా కళారూపాల రక్షణకు ప్రభుత్వం పలు కార్యక్రమాలు చేపట్టిందన్నారు. సిరిసిల్లలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాలను పురస్కరించుకుని సుమారు 200 మంది కళాకారులు సాంస్కృతిక ప్రదర్శనలిచ్చారు. వీటిలో యక్షగానం, ఒగ్గుకథ, ఒగ్గుడోలు, పల్లె సుద్దులు, జానపద నృత్యాలు, తెలంగాణ ఉద్యమ గీతాలు తదితరాలు ఉన్నాయి. ఈ కార్యక్రమానికి సీనియర్ సివిల్ జడ్జి శ్రీనివాస్, ఎస్పీ రాహుల్ హెగ్డే, జెసి యాస్మిన్ భాషా, డిఆర్‌వో శ్యాంప్రసాద్‌లాల్, ఆర్డీవో పాండురంగ, మున్సిపల్ చైర్‌పర్సన్ సామల పావని, రీజినల్ ఆర్గనైజర్ గుగులోతు రేణ తదితరులు పాల్గొన్నారు.

Comments

comments