Search
Sunday 24 June 2018
  • :
  • :
Latest News

తండ్రిపై కోపం.. కూతురిపై అత్యాచారం.. హత్య

Rape

లక్నో: ఓ తండ్రిపై ఉన్నకోపంతో ఆయన కూతుర్నిఅపహరించి, అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన ఉత్తరప్రదేశ్ లోని లభింపూర్ ఖేరి జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం… గ్రామానికి చెందిన చోటీలాల్, మరో వ్యక్తి మధ్య కొన్ని రోజుల నుంచి భూ వివాదంలో గొడవలు నడుస్తున్నాయి. రెండు, మూడు రోజుల నుంచి వీరి మధ్య తగాదాలు తారస్థాయికి చేరుకున్నాయి.  ఈ నేపథ్యంలో చోటీలాల్ ఆ వ్యక్తిపై విపరీతంగా పగ పెంచుకున్నాడు. దీంతో ఆయన కూతురిని (8)ను చోటీలాల్ ఆదివారం కిడ్నాప్ చేశాడు. గ్రామ శివారులో ఉన్నచెరుకు తోటలోకి చిన్నారి తీసికెళ్లి హత్యాచారం చేసి తర్వాత దారుణంగా హత్య చేశాడు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారించగా, తానే ఈ మర్డర్ చేసినట్టు పోలీసుల ఎదుట నిందితుడు అంగీకరించాడు. భూమి విషయంతో గొడవ జరగటంతోనే ఈ అఘాయిత్యానికి పాల్పడినట్టు చోటీలాల్ తెలిపాడు. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్టు  పోలీసులు వెల్లడించారు.

Comments

comments