Search
Saturday 23 June 2018
  • :
  • :
Latest News

గంజాయి పట్టివేత

Marijuana Seized at Warangal

వరంగల్ : అక్రమంగా తరలిస్తున్న గంజాయిని టాస్క్‌ఫోర్స్ పోలీసులు బుధవారం పట్టుకున్నారు. అక్రమంగా గంజాయి తరలిస్తున్నట్టు సమాచారం అందడంతో దాడి చేసి పట్టుకున్నట్టు పోలీసులు తెలిపారు. పట్టుబడిన 107 కిలోల గంజాయి విలువ సుమారు రూ.16లక్షల విలువ ఉంటుందని వారు వెల్లడించారు. ఇద్దరు మహిళలతో పాటు మరో వ్యక్తిని అరెస్టు చేశామని వారు పేర్కొన్నారు. అరెస్టు అయిన వారు వర్థన్నపేట మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన భార్యాభర్తలు వెంకటచారి, పద్మతో పాటు రాయపర్తి మండలం కేశవపూర్‌కు చెందిన స్వాతి ఉన్నట్టు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు చెప్పారు.

Marijuana Seized at Warangal

Comments

comments