Search
Tuesday 19 June 2018
  • :
  • :

వరకట్న వేధింపులతో వివాహిత ఆత్మహత్య

 Married Woman Suicide With Husband Harassment

తొగుటః వరకట్న వేధింపులతో వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన తొగుట మండలంలోని పల్లెపహడ్ లో గురువారం చోటు చేసుకుంది. సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన శేరి లావణ్యకు సిద్దిపేట పట్టణానికి చెందిన ప్రకాశ్ తో 2 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. కాగా గత కొన్ని రోజుల నుండి భర్తతో పాటు అత్తింటి కుటుంబీకులు అధిక వరకట్నం తేవాలని వేధించడం ప్రారంభించడంతో మానసికంగా కుంగి పోయిన లావణ్య గురువారం ప్రోద్దున విషపు గుళికలు మింగి ఆత్మహత్యకు ప్రయత్నం చేసింది. దాంతో కుటుంబ సభ్యులు లావణ్యను చికిత్స నిమిత్తం గజ్వేల్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయింది.మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు తొగుట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Comments

comments